Bigg Boss Telugu 7: బయటపడ్డ అమర్‌దీప్ వేస్ట్ గేమ్.. పరువు పోగొట్టుకున్న హీరో.. మరీ ఇలా దిగజారుతారా?

తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ సరికొత్త కాన్సెప్టుతో సాగుతున్న షోనే బిగ్ బాస్. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను చూపిస్తున్నా ప్రేక్షకులు మాత్రం భారీ స్పందననే అందిస్తున్నారు. ఫలితంగా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఏడో దానిని కూడా విజయవంతంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన అమర్‌దీప్ వేస్ట్ గేమ్ ఆడి పరువు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలను మీరే చూడండి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో గత సీజన్లలో ఎప్పుడూ కనిపించని టాస్కులను ఇస్తున్నారు. ఫలితంగా ఇది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో వారానికి గానూ నిర్వహించే కెప్టెన్సీ కంటెండర్ల టాస్కును 'బీబీ మారథాన్' పేరిట ఇచ్చారు. అంటే ఇందులో గెలిచిన వాళ్లే కెప్టెన్సీ పోటీదారులు అవుతారు.

Trolls on Amardeep Chowdary Foul Game in Bigg Boss Telugu 7 Show

'బీబీ మారథాన్' కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లోని కంటెస్టెంట్లలో నలుగురు మాత్రమే ఒక రౌండ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అందులో గెలిచిన వాళ్లు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేసి కెప్టెన్సీ పోటీదారు అవుతారు. నలుగురిలో చివరి స్థానానికే పరిమితం అయిన వాళ్లు మాత్రం ఈ టాస్కు నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ వెల్లడించాడు.

'బీబీ మారథాన్' కెప్టెన్సీ టాస్కులోని మొదటి రౌండ్‌లో నీటిలో మునిగే, తేలే వస్తువులు ఏంటి అనేది సరిగా కనిపెట్టే గేమ్‌ను ఇచ్చారు. ఇందులో ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్‌దీప్ చౌదరి, టేస్టీ తేజలు పాల్గొన్నారు. దీనికి గౌతమ్ కృష్ణ సంచాలకుడిగా వ్యవహరించారు. ఈ టాస్కులో ఎక్కువ సరైన సమాధానాలు చెప్పి ప్రియాంక టాప్‌లో నిలిచింది. తద్వారా పోటీదారు అయింది.

ఈ టాస్కులో ప్రియాంక తర్వాత శోభా శెట్టికి ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే, చివరి స్థానం విషయంలో మాత్రం అమర్‌దీప్ చౌదరికి, టేస్టీ తేజకు టై అయింది. దీంతో వీళ్లిద్దరికీ టై బ్రేకర్ రౌండ్‌ను నిర్వహిస్తామని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడే ఇందులో గెలవడం కోసం అమర్‌దీప్ అడ్డదారులు తొక్కాడు. తనకు సాయం చేయాలని ప్రియాంక, శోభా శెట్టిని వేడుకున్నాడు.

టాస్కు జరిగే సమయంలో ఆన్సర్స్ చెప్పడం కోసం సైగలు చేయాలని సూచించాడు. ఇలా ఒక సమాధానం కరెక్టుగా చెప్పాడు. కానీ, రెండో దాని విషయంలో ప్రియాంక, ఒకలా, శోభా శెట్టి ఒకలా సైగలు చేశారు. దీంతో కన్‌ఫ్యూజ్ అయిన అమర్‌దీప్.. తప్పు సమాధానం చెప్పాడు. ఫలితంగా ఈ రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. తద్వారా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

Trolls on Amardeep Chowdary Foul Game in Bigg Boss Telugu 7 Show

టాస్కులో ఓడిపోయిన తర్వాత అమర్‌దీప్ వ్యవహరించిన తీరు విమర్శలకు కారణం అవుతోంది. ఓటమిపాలైన తర్వాత అతడు మరింత దిగజారిపోయి మాట్లాడాడు. ప్రియాంక సైగల ద్వారానే ఆన్సర్ చెప్పినట్లు శోభాతో అన్నాడు. ఇలా ఫౌల్ గేమ్ ఆడిన విషయం ఆడియెన్స్‌కు అర్థం అయ్యేలా వ్యవహరించాడు. దీంతో అతడిని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక, ఈ టాస్కులో ఓడిపోయిన తర్వాత అమర్‌దీప్ చౌదరి ఏడుస్తూ కనిపించాడు. అంతేకాదు, అన్నం తినను అంటూ మారాం చేశాడు. దీంతో అర్జున్ వెళ్లి మందలించి తీసుకుని వచ్చాడు. వాస్తవానికి అంతకు ముందు భోలే షావలితో గేమ్ విషయంలో అమర్‌దీప్ గొడవ పడ్డాడు. ఆయనకు ఆట ఆడడం రాదని అన్నాడు. చివరికి అమర్‌ ఆడలేక టాస్క్ నుంచి తప్పుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X