గర్ల్ ఫ్రెండ్‌ను అక్కడ టచ్ చేశాడు... ఆగ్రహంతో దాడి చేసిన నటుడు, అరెస్ట్!
టీవీ నటుడు అభిమన్యు చౌదరి, అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరూ కలిసి ఒక సెలూన్ ఎంప్లాయిపై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెలూన్ ఎంప్లాయ్ తనను తాకకూడని చోట తాకుతూ ఇబ్బందులకు గురి చేశాడని ఆమె వారికి ఫోన్ చేసి చెప్పడంతో ... ఈ ఇద్దరూ వచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ముంబై లోఖండ్‌వాలా పోలీస్ ఆఫీసర్ శైలేష్ పసల్వాద్ మాట్లాడుతూ...'అభిమన్యుతో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశాం. వారి ఉమెన్ ఫ్రెండ్ పిలవడంతో వారు వచ్చి దాడి చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం' అన్నారు.

సెలూన్ ఎంప్లాయి హెడ్ మసాజ్ చేస్తానని చెప్పి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అభిమన్యు గర్ల్ ఫ్రెండ్ ఆరోపించారు. ఆ కోపంతోనే వారు దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ దాడి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. సెలూన్లో వీరు సృష్టంచిన గందరగోళం కారణంగా మరో ఎంప్లాయీ కూడా గాయపడింది.
కాగా.. సెలూన్ ఎంప్లాయీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అభిమన్యు చౌదరి స్నేహితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. హిందీ సీరియల్ మన్మోహినిలో సపోర్ట్ రోల్ చేస్తున్న అభిమన్యు... ఆ మధ్య ధనుష్-అమితాబ్ కాంబినేషన్లో వచ్చిన 'షమితాబ్'లో ఓ చిన్న పాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications











