నటిని వేధించిన టీవీ నటుడి అరెస్ట్, అసలు ఏం జరిగిందంటే..
మహిళను వేధించడంతో పాటు ఆమెపై దాడి చేసిన టీవీ యాక్టర్ అభినవ్ కోహ్లిని ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వేధింపులకు గురైన మహిళ ముంబై సబర్బన్‌లోని సమతా నగర్ పోలీసులను ఆశ్రయించడంతో 39 ఏళ్ల అభినవ్ కోహ్లిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ కూడా టీవీ నటి కావడం గమనార్హం. ఆదివారం సాయంత్రం ఆమె కంప్లయింట్ ఫైల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అభినవ్ కోహ్లి అక్టోబర్ 2017 నుంచి పలు దఫాలుగా సదరు మహిళను వేధించాడని, ఆమె పట్ల అసభ్య పదజాలం ఉపయోగించి హరాస్ చేసేవాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆమెను తరచూ కొట్టడంతో పాటు తన మాట వినకపోతే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను, ఆమె తల్లిని బెదరించేవారని తెలిపారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...బాధితురాలు, ఆమె తల్లి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆదివారం రాత్రి కోహ్లిని అరెస్ట్ చేశారు.
అభినవ్ కోహ్లి మీద ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన అనంతరం లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అతడికి మంగళవారం వరకు పోలీస్ కస్టడీ విధించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారు.


Click it and Unblock the Notifications











