తప్పతాగి టీవీ నటి ప్రైవేట్ పార్ట్‌లను దారుణంగా.. హోళీ వేడుకల్లో టీవీ నటుడి అరాచకం

రంగుల పండుగ హోళీని సినీ తారలు ఉత్సాహంగా జరుపుకొన్నారు. బాలీవుడ్‌లో తమన్నా, విజయ్ వర్మ, ఇతర బాలీవుడ్ అగ్ర నటులంతా ఉత్సాహం పండుగను సహృద్బావ వాతావరణంలో జరుపుకొన్నారు. నీటిలో తడుస్తూ.. రంగుల్లో మునిగి తేలారు. కానీ ముంబైలో ఓ ప్రైవేట్ పార్టీలో టీవీ నటిని లైంగికంగా వేధించిన టెలివిజన్ నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పార్టీలో జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసు వ్యవహారం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ టీవీ నటి ఫిర్యాదు వివరాల్లోకి వెళితే..

ముంబై నగర శివారులోని జోగేశ్వరి ప్రాంతంలో రూఫ్ టాఫ్ పార్టీని ఓ కంపెనీ నిర్వహించింది. ఆ పార్టీలో పలువురు వినోద పరిశ్రమకు చెందిన వారు పాల్గొన్నారు. సీనీ, టెలివిజన్ నటులు భారీగా పాల్గొన్నారు. రంగుల్లో మునిగి తేలుతూ హోళీని జరుపుకొన్నారు. తన స్నేహితులు, కొలీగ్స్‌తో స్నేహపూరిత వాతావరణంలో రంగులు పూసుకొన్నారు. అయితే ఈ రూఫ్ టాప్ పార్టీలో టీవీ నటి విషయంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకొన్నది.

TV Actor allegedly applied colour on Television Actress

తనపై జరిగిన లైంగిక వేధింపులు, తాను చెప్పలేని ప్రదేశంలో రంగులు పూయడంపై తన సహ నటుడు, టీవీ యాక్టర్‌పై టెలివిజన్ నటి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. మేమంతా హోళీ అడుతున్నాం. నా తోటి టీవీ నటుడు వచ్చి ముఖంపై రంగులు పూసాడు. ఫర్వాలేదని ఊరుకొన్నాను. ఆ తర్వాత తన శరీరాన్ని చెప్పరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. తాను వారిస్తున్నా నా ప్రైవేట్ పార్టులను ముట్టుకొన్ని రంగు పూసాడు అని టీవీ నటి తన కంప్లైంట్‌లో తెలిపింది.

{embed-poll}

నా తోటి నటుడు ఆ సమయంలో పీకల్లోతు తాగాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అతడికి తెలియడం లేదు. ముందుగా నా ముఖంపై పూస్తే సరే అనుకొన్నాను. ఆ తర్వాత నన్ను అసభ్యంగా తాకుతూ రంగులు పూయడానికి ప్రయత్నించాడు. దాంతో నేను అతడి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేశాను. తనకు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించి ఓ చోట దాక్కున్నాను. అయినా వదల్లేదు. కేవలం నాతోనే కాదు. పార్టీకి వచ్చిన ఇతర మహిళలపై అసభ్యంగా, దురుసుగా ప్రయత్నించాడు అని ఫిర్యాదులో వెల్లడించింది.

ఇదిలా ఉండగా, తాము అతడిని వారిస్తుంటే.. వినకుండా.. ఐ లవ్ యూ.. నిన్ను పట్టుకొంటే నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ వెంటపడ్డాడు. మద్యం మత్తులో నాపై తూలుతుంటే వెనక్కి నెట్టి వేశాను. అయినా నాపై పడి నా ప్రైవేట్ పార్టులపై చేతులు వేశాడు. ఆయన తీరుతో మెంటల్‌గా షాక్ తిన్నాను. అతడి ప్రవర్తనతో నా స్నేహితులు కూడా దిగ్బ్రాంతికి గురయ్యారు అని టీవీ నటి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది.

టీవీ నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశాడు. సదరు టీవీ నటుడిపై భారత న్యాయ సంహిత చట్టం కింద పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడిని విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. ఈ హోళీ జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ ప్రారంభించారు.

{embed-poll}

More from Filmibeat

Read more about: holi tv actress mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X