భార్య అకౌంట్ నుంచి కోటి దోచేసిన టీవీ నటుడు.. ప్లాన్ మామూలుగా లేదుగా!
టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వచ్చాక దానిని మంచి పనుల కోసం ఎంతగా వాడుతున్నారో అసాంఘిక కార్యకలాపాల కోసం కూడా అదే విధంగా వాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ టెక్నాలజీ దెబ్బకు ఒక్కోసారి సెలబ్రిటీలు కూడా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా తన భార్య అకౌంట్ నుంచి కోటి రూపాయలు మాయం చేసిన టీవీ నటుడి మీద పోలీస్ కేసు నమోదయింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

టీవీ నటుల క్రేజ్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు టీవీ ఇండస్ట్రీ కూడా వర్థిల్లుతోంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా టెలివిజన్ నటులు సినీ నటులతో పాటు సంపాదిస్తున్నారు. వారు ఎంత క్రేజ్ సంపాదిస్తున్నారు అనే సంగతి పక్కన పెడితే వారి గురించి చిన్న నెగటివ్ వార్త వచ్చినా వెంటనే దావానలంలా వ్యాపింస్తోంది. అలాంటి వార్తే ఇప్పుడు ముంబైలో వెలుగులోకి వచ్చింది.

ఏకంగా కోటి
తన భార్య బ్యాంక్ అకౌంట్ నుంచి ఆమెకు తెలియకుండా ఆమె డబ్బులు విత్ డ్రా చేసిన ఘటనలో హిందీ టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రా మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన లక్ష, రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలు భార్యకు తెలియకుండా విత్డ్రా చేసినట్లు భార్య గుర్తించి గత శుక్రవారం నాడు గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

పోలీసులకు ఫిర్యాదు
ఈ కేసుకు సంబంధించి విచారణ మొదలు పెట్టిన పోలీసులు ఆ డబ్బు విత్ డ్రా చేసింది ఎవరో కాదు ఆమె భర్తనే అని గుర్తించి అతని మీద కేసు నమోదు చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మెహ్రా మీద ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇది రెండవ సారి. ఈ ఏడాది మే 31వ తేదీన తన భర్త కరణ్ మెహ్రా మీద దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కోటి రూపాయలు విత్ డ్రా
ఈ కేసులో ఆయనను అరెస్టు కూడా చేయగా ఈ మధ్యనే ఆయనకు బెయిల్ కూడా లభించింది. ఇంతలోనే కోటి రూపాయలను నాకు తెలియకుండా ఖాతాలో నుంచి డ్రా చేశారని చెబుతూ ఫిర్యాదు చేయడంతో కరణ్ మెహ్రా సహా ఆయన కుటుంబ సభ్యులందరూ మీద పోలీసులు కేసు బుక్ చేశారు.

సూసైడ్ చేసుకోవాలనుకున్నా
ఈ దంపతుల మధ్య ఇప్పుడు ఏదో ఒక వివాదాలలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తన భార్య ప్రవర్తన సరిగ్గా లేదని, చాలా అగ్రెసివ్ గా ఉంటుందని చెబుతూ ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఆమె బిహేవియర్ చూసి ఒకానొక సందర్భంలో తాను చనిపోవాలని భావించానని కూడా కారణం మెహ్రా కామెంట్స్ చేశాడు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











