టీవీ నటుడి అరెస్ట్: డేటింగ్ యాప్‌తో మహిళను ముగ్గులోకి.. పెళ్లి పేరుతో రేప్.. బ్లాక్‌మెయిల్

టెలివిజన్ నటుడు, గాయకుడు కరణ్ ఒబెరాయ్ అరెస్ట్ తర్వాత అనేక విషయాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళపై మానభంగం చేసి బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణలపై యువ నటుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కరణ్ లాయర్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. దాంతో మానభంగానికి దారి తీసిన పరిస్థితులపై క్లారిటీ వస్తుందని ముంబై పోలీసులు ఏం చెప్పారంటే..

 కరణ్ ఒబేరాయ్ అరెస్ట్

కరణ్ ఒబేరాయ్ అరెస్ట్

తనను రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదుతో ముంబై ఓషివారా పోలీసులు కరణ్ ఒబేరాయ్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను రేప్ చేసిన విషయం నిజమేనని, ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించినట్టు వెల్లడైంది. అలాగే ఓ జ్యోతిష్యుడి నుంచి డబ్బులు లాగేందుకు ప్రయత్నించాడనే విషయం బయటకు వచ్చింది.

 డేటింగ్ యాప్ ద్వారా పరిచయం

డేటింగ్ యాప్ ద్వారా పరిచయం

ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం.. 2016 నుంచి బాధితురాలితో కరణ్ ఒబేరాయ్‌కి పరిచయం ఉంది. వారిద్దరు డేటింగ్ మొబైల్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. మహిళతో కరణ్ కొన్నాళ్లుగా డేటింగ్ చేయడం జరిగిందనే విషయాలు మా దృష్టికి వచ్చాయి అని వెల్లడించారు.

పెళ్లి చేసుకొంటానని నమ్మించి.. మోసం

పెళ్లి చేసుకొంటానని నమ్మించి.. మోసం

తనను పెళ్లి చేసుకొంటానని నమ్మించాడు. పెళ్లి పేరుతో బలవంతంగా నన్ను శారీరకంగా వాడుకొన్నాడు. తనపై రేప్ చేసిన అతను ఆ వ్యవహారాన్ని వీడియోగా చిత్రీకరించాడు. ఆ తర్వాత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే వీడియోను రిలీజ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది.

ఆరోపణల్లో వాస్తవం లేదు.. కరణ్ ఒబేరాయ్

ఆరోపణల్లో వాస్తవం లేదు.. కరణ్ ఒబేరాయ్

తనపై మహిళ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నాపై చేసిన ఫిర్యాదు నిరాధారం. కావాలంటే నా వెర్షన్ కూడా పోలీసులు వినాలి అని కరణ్ ఒబేరాయ్ కోరాడు. గురువారం వరకు కరణ్ పోలీస్ కస్టడీలోనే ఉంటాడు. భాదితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు వెల్లడించారు.

 యాప్ చాటింగ్‌పై విచారణ చేపట్టాలి

యాప్ చాటింగ్‌పై విచారణ చేపట్టాలి

ఇదిలా ఉండగా, కరణ్ తరఫు లాయర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్బంగా మేజిస్ట్రేట్‌కు తన వాదనలు వినిపించారు. డేటింగ్ యాప్‌లో జరిగిన చాటింగ్‌ను విచారణకు తీసుకోవాలి. డేటింగ్ యాప్ ద్వారానే ఆమె తన క్లయింట్‌ కరణ్‌కు చేరువైంది. ఛాటింగ్ వ్యవహారాన్ని బయటపెడితే మహిళ స్వరూపం తెలుస్తుంది అని లాయర్ ఆరోపణలు చేశాడు.

 కరణ్‌ ఒబేరాయ్‌ను బ్లాక్‌మెయిల్ చేసింది

కరణ్‌ ఒబేరాయ్‌ను బ్లాక్‌మెయిల్ చేసింది

తన క్లయింట్ కరణ్ ఒబేరాయ్ సెలబ్రిటీ కావడంతో అతడి నుంచి డబ్బులు లాగేందుకు ప్రయత్నించింది. కరణ్‌పై రకరకాల ఒత్తిడి తెచ్చింది. తనకు డబ్బు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మహిళ బెదిరించింది. అందుకు నా క్లయింట్ ఒప్పుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేవలం కరణ్‌ను ప్రతిష్టను బజారుకిడ్చేందుకే కుట్ర పన్నింది అని లాయర్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X