టీవీ నటుడి రేప్ కేసులో ట్విస్ట్: బాధితురాలిపై కత్తితో దాడి.. యాసిడ్ పోసి..
టెలివిజన్ నటుడు కరన్ ఒబేరాయ్‌పై నమోదైన రేప్ కేసులో బాధితురాలిపై దాడి జరిగింది. శనివారం ఉదయం ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఆమెపై దాడి చేసి పారిపోయారు. బాధితురాలిపై కత్తితో దాడి చేశారు. పారిపోతూ కేసు వాపసు తీసుకోవాలని ఓ లేఖను సంఘటనా స్థలంలో వదిలిపెట్టడం గమనార్హం.
తనపై దాడి అనంతరం బాధితురాలు ముంబైలోని ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసినట్టు సమాచారం. వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించాడు. వెనుక కూర్చొని ఉన్న మరో వ్యక్తి మాస్క్ ధరించాడు. ఓ వ్యక్తి తనను చేయిపట్టి లాగి బెదిరింపులకు పాల్పడ్డాడు. చేతిలో ఓ బాటిల్ ఉంది. కేసు వాపసు తీసుకోకపోతే తనపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు అని బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.

దాడి ఘటన జరిగిన వెంటనే బాధితురాలు సిద్దార్థ హాస్పిటల్‌కు వెళ్లి వైద్య చికిత్స చేయించుకొన్నారు. ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకొనేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఆసరగా తీసుకొంటున్నారు. ఐపీసీ 324, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలు వృత్తిరీత్యా జోతిష్యురాలు. తనపై లైంగిక దాడి చేసి.. ఆ తతంగాన్ని వీడియోగా చిత్రీకరిస్తున్నాడు. డబ్బు ముట్టచెప్పకపోతే వీడియోను రిలీజ్ చేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై మే 6 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నటుడు, గాయకుడు కరణ్ ఒబేరాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన పోలీసు కస్టడిలోనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











