మద్యం మత్తులో రెచ్చిపోయిన నటుడు.. బాలికతో అలా చేయడంతో అరెస్ట్!
ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులతో పాటు టీవీ నటులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఏకంగా కొందరు అయితే కేసులలో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే పెర్ల్ వీ పూరి అనే నటుడు అరెస్ట్ కాగా ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కూడా కేసులో ఇరుక్కున్నాడు. పైగా ఈయన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ప్రముఖ నటుడు
ఒక గుర్తు తెలియని యువతి మీద వేధింపులకు పాల్పడినట్టు 'కసౌతి జిందగీ కే' ఫేమ్ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్ మీద కేసు నమోదు కావడంతో ముంబై పోలీసులు శనివారం ఆయనని అరెస్టు చేశారు. కరూర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

పలు సెక్షన్ల కింద
పోలీసుల వివరాల మేరకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లోని 354, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాల్డ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ బేలే ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు..

మద్యం మత్తులో
తమకు ఫిర్యాదు చేసిన బాలికను ప్రచీన్ ఒక స్నేహితుడితో పాటు జూన్ 30న తన నివాసానికి ఆహ్వానించాడని, ఆ సమయంలో నిందితుడు మద్యం సేవించి ఆమెను అనుచితంగా తాకాడని పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ రోజు అరెస్ట్ చేసి బోరివాలి కోర్టులో హాజరుపరిచారు. జడ్జ్ అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు.

కసౌటి జిందగి కే తో ఎంట్రీ
ప్రచీన్ చౌహాన్ ఏక్తా కపూర్ యొక్క సీరియల్ 'కసౌటి జిందగి కే'తో టీవీ రంగంలో అడుగు పెట్టాడు, దీనిలో అతను సుబ్రోటో బసు పాత్రలో కనిపించాడు. ఆ తరువాత కలర్స్ టీవీలో హతీమ్, మాట్ పితా కే చార్నన్ మెయిన్ స్వర్గ్ లాంటి టాక్ షోలు, సీరియల్స్ చేసి పాపులర్ అయ్యాడు.

షాదీ ముబారక్
ప్రస్తుతం ఆయన 'షాదీ ముబారక్' లో విశాల్ అగర్వాల్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మధ్యనే టీవీ నటుడు ఫర్ల్ వీ పురి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అరెస్టయ్యారు. కొన్ని రోజుల అనంతరం అతనికి బెయిల్ లభించింది. అయితే ఇలా వరుసగా టీవీ నటులు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.


Click it and Unblock the Notifications











