twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ నటుడు ఆత్మహత్య.. పోలీసుల అనుమానం.. ముందు రోజు ఏంజరిగిందటే!

    |

    వినోద పరిశ్రమలో మరో నటుడు ఆత్మాహత్యయత్నానికి పాల్పడ్డాడు. హిందీ టెలివిజన్ నటుడు రాహుల్ దీక్షిత్ సూసైడ్ చేసుకోవడం సినీ, టెలివిజన్ రంగాలను కుదిపేసింది. 28 ఏళ్ల రాహుల్ అనుమానాస్పద స్థితిలో మరణించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

    ముంబైలో ఆత్మహత్య

    ముంబైలో ఆత్మహత్య

    రాహుల్ దీక్షిత్ జైపూర్‌కు చెందిన వాడు. టెలివిజన్ రంగంలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో తన నివాసంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మరణించాడు అని పోలీసులు తెలిపారు.

    సూసైడ్ నోట్ కోసం వెతుకులాట

    సూసైడ్ నోట్ కోసం వెతుకులాట

    ముంబై పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. రాహుల్ మృతిని ఆత్మహత్యగానే నిర్ధారించారు. అయితే గదిలో సూసైడ్ నోట్ లభించకపోవడం వల్ల కొన్ని అనుమానాలు తలెత్తాయి. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అని ముంబై పోలీసులు పేర్కొన్నారు.

    మరణానికి ముందు స్నేహితులతో పార్టీ

    మరణానికి ముందు స్నేహితులతో పార్టీ

    మరణానికి ముందు కొద్ది గంటల క్రితం రాత్రి రాహుల్ తన స్నేహితులతో పార్టీ చేసుకొంటున్నట్టు తన ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేశాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పార్టీలో గానీ, పార్టీ తర్వాత ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    తండ్రి ట్వీట్‌తో నెటిజన్లు..

    తండ్రి ట్వీట్‌తో నెటిజన్లు..

    రాహుల్ మరణంతో తండ్రి మహేష్ దీక్షిత్ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నాడు. ఈ ప్రపంచాన్ని వీడిపోవాల్సిన ఖర్మ ఏం పట్టింది రాహుల్ అంటూ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. రాహుల్ తండ్రి చేసి ట్వీట్‌ నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తున్నది.

    English summary
    Television actor Rahul Dixit allegedly killed himself. According to ANI, 28-year-old TV actor committed suicide early this morning. Mumbai Police have registered a case of accidental death and further investigation is underway.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X