అనుమానాస్పద స్థితిలో నటి ఆత్మహత్య.. అతని పనే అంటున్న కుటుంబ సభ్యులు!

ఒరియా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ టీవీ నటి రష్మీ రేఖ ఓజా మరణ వార్త తెరపైకి వచ్చింది. జూన్ 18వ తేదీ రాత్రి నటి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. రష్మీరేఖ భువనేశ్వర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మీడియా నివేదికల ప్రకారం, రష్మీ రేఖ తన లవర్ సంతోష్ పాత్రోతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమె మరణానికి కారణం సంతోష్ పాత్రో అని అనుమానిస్తున్నారు పోలీసులు. జూన్ 18వ తేదీ రాత్రి రష్మీ రేఖ తండ్రి ఆమెకు చాలాసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ తీయలేదు. అనంతరం రష్మీ రేఖ లవర్ సంతోష్, ఆమె తండ్రికి ఫోన్ చేసి మృతి చెందిన విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తండ్రికి తన కూతురు సంతోష్ పాత్రోతోలివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇంటి యజమాని తండ్రికి తెలియజేశాడు.

ప్రస్తుతం పోలీసులు అసాధారణ మృతిగా కేసు నమోదు చేసి, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పోలీసులు ప్రాధమిక దర్యాప్తు ప్రకారం ప్రకారం ఇది ఒక ఆత్మహత్య కేసు అని భావిస్తున్నారు. ఎందుకంటే ఘటనా స్థలంలో రష్మీ రేఖ సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఘటన వెనుక సంతోష్ పాత్రో హస్తం ఉందని రష్మీరేఖ తండ్రి ఆరోపించారు. రష్మీరేఖ వయసు 23 ఏళ్లు. ఒరియా టీవీ సీరియల్ 'కేమితి కహిబీ కహా' ద్వారా రష్మీ రేఖకు మంచి గుర్తింపు వచ్చింది.

TV actor Rashmirekha Ojha found dead at rented home

ఆమె మరణ వార్త తెరపైకి రావడంతో, పోలీసులు ప్రతి కోణం నుండి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక ఆమె లవర్ సంతోష్ పాత్రను కూడా ఈ కేసులో విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభిస్తారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం దేశంలో టాప్ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ మృతి గ్లామర్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. జూన్ 11న ఆమె మృతదేహం బాత్‌రూమ్‌లో పడి ఉంది. కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడం వల్ల ఆమె మృతి చెందినట్లు సమాచారం. దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరిగా గుర్తింపు పొందింది. ఆమె మృతిని అనుమానాస్పదంగా భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యూష గది నుంచి ఓ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X