చిరంజీవిలా ఉండటమే నాకు శాపం.. వాళ్లు కన్నెర్రజేస్తే ఎక్కడా కనిపించం: నటుడి కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదిగి బాస్ గా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆపద ఉన్నవారికి సహాయం చేస్తూ ఆపద్బాంధవుడు అయ్యారు. ఇక టాలీవుడ్ కు ఏదైన సమస్య అయితే దాన్ని పరిష్కరించడంలో పెద్ద కొడుకులా బాధ్యత తీసుకుని అడుగు ముందుకు వేస్తారు. నటన పరంగా ఆయన ఒక శిఖరం. ఆయన అంతా ఎత్తుకు ఎదగడం అనే మాట పక్కన పెడితే రూపంలో ఆయన పోలికలు ఉంటే ఏంతో సంబరపడతారు. కానీ ఓ టీవీ నటుడు మాత్రం చిరంజీవి పోలికలతో ఉండటం శాపంగా మారిందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
దాసరి శిష్యుడిగా..
టీవీ యాక్టర్ రాజ్ కుమార్ నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఆయన నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సీరియల్ నటుడు రాజ్ కుమార్ (VV Raj Kumar). ఆయన్ను ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పిలిచేవారు. చూడటానికి అచ్చం మెగాస్టార్ చిరంజీవిలా ఉండటంతో అలా పిలిచేవారు. దర్శక నిర్మాత దాసరి నారాయణరావు శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
హీరోగా అలా ఎంట్రీ..
అమ్మ రాజీనామా సినిమాతో రాజ్ కుమార్ హీరోగా పరిచయం అయ్యారు. నాగబాల, సంసారాల మెకానిక్, కాలేజీ బుల్లోడు ఇలా పలు చిత్రాల్లో నటించారు. తర్వాత బుల్లితెరపై అలరించారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవిలా ఉండటం వల్లే తనకు పెద్ద మైనస్ అయిందని చెప్పుకొచ్చారు రాజ్ కుమార్.

అదే మాట వస్తుంది
"ఏ హీరోకి అయినా స్టార్ డమ్ తో పాటు బ్రేకింగ్ పాయింట్ ఉండాలి. నాకు ఆ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికీ బ్రేక్ పడిన విషయం ఏంటంటే నేను చిరంజీవిలా ఉండటం. చిరంజీవీలి ఉన్నాడు. భలే బాగున్నాడు అని అనడం బయట సొసైటీ వరకు బాగానే ఉంటుంది. కానీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మీరు ఏం చేసినా కూడా అదే మాట వస్తుంది" అని వీవీ రాజ్ కుమార్ తెలిపారు.
విక్రమ్-అజిత్ నేను ఒకేసారి
"చిరంజీవిలా ఉండటం మంచిదో చెడ్డదో నాకు తెలియదు. ఇప్పుడు కూడా నేను అలాగే ఉండొచ్చు. కానీ చిరంజీవిలాగా.. ఆ లాగాలోనే చాలా అర్థాలు వస్తాయి. లాగా ఉంటాం తప్పితే ఆయన అదృష్టానికి స్టార్ డమ్ కి మనం ఎక్కడూ కూడా సరిపోం. అక్కడ ఆ పాయింట్ దగ్గర నాకు బాగా మైనస్ అయింది. నేను శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ ఇలా ఏడెనిమిది మంది హీరోలంతా ఒకే సమయంలో వచ్చాం" అని నటుడు రాజ్ కుమార్ పేర్కొన్నారు.
చాలా ఇబ్బందులు పడ్డా
"వాళ్లందరి కంటే నా కెరీర్ ముందు స్టార్ట్ అయింది. తర్వాత వాళ్లంత నన్ను దాటి వెళ్లిపోయారు. ఎందువల్ల అంటే నేను చిరంజీవిలా ఉండటమే. నేను ఏం చేసినా చిరంజీవిలాగే కనిపిస్తుంది. మాట్లాడటానికి బాగుంటుంది. కానీ కెరియర్ పరంగా కలిసిరాలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయనకు డాన్స్ నేర్పే వాళ్లే నాకు నేర్పేవాళ్లు. ఆ సినిమా రిలీజ్ అయితే.. నా సినిమా రిలీజ్ అయ్యేది. ఆయనతో నన్ను కంపేర్ చేసేవారు. ఆయన ఒక శిఖరం. అలాంటి వ్యక్తితో పోల్చడం వల్ల నేను మాములు ఇబ్బందులు పడలేదు" అని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.

హ్యాపీనే.. అందుకు పనికిరాదు
"చిరంజీవిలా కనిపించకుండా ఉండేందుకు మీసాలు కూడా తీసేశాను. నా సొంత సినిమాలో మీసాలు తీసేసి నటించాను. తర్వాత తెలుగు ఇండస్ట్రీ వదిలి కర్ణాటక వెళ్లిపోయా. అక్కడైనా సినిమాలు చేసుకుందామా అంటే అదీ కుదర్లేదు. అక్కడా ఇదే పరిస్థితి. కన్నీళ్లతో కూడిన ఆనందం. ఒకరకంగా ఆయనలా ఉండటం హ్యాపీ. కానీ ఇండస్ట్రీకి అది పనికిరాదు" అని సీరియల్ నటుడు రాజ్ కుమార్ వెల్లడించారు.
ఇప్పటికీ అదే గోల
"మిమ్మల్ని తొక్కేశారు సార్ అని చాలా మంది అటారు. నేను ఒక్కటే చెప్పాను. తొక్కేవాల్లే అయితే కనిపంచకుండా చేస్తారు. టీవీలోకి కూడా రానివ్వరు. వాళ్లు కన్నెర్రజేస్తే సినిమా కాదు.. టీవీ కాదు.. యూట్యూబ్ లో కూడా కనిపించము. ఆయన మనల్ని గుర్తు పెట్టుకునేటంతా ఖాళీగా ఏం లేరు. చాలా సందర్భాల్లో ఆయన నన్ను పిలిచి మాట్లాడేవారు. బాగా చేస్తున్నావ్. ఇంకా చేయ్ అనే అంటారు. ఇప్పటికీ జూనియర్ చిరంజీవి అనే గోల ఉంది" అని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











