కార్, అపార్టుమెంటులో నటిపై అత్యాచారం.. కేసు నమోదు
ముంబై: హిందీ టీవీ నటుడు యష్ పండిత్ మీద అత్యాచారం కేసు ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం... ఓ టీవీ సీరియల్ సెట్లో యష్ పండిత్ కు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే అతడు ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేసాడు. ఈ క్రమంలో ఆమెను మభ్యపెట్టి పార్కింగ్ ఏరియాలో కార్ లోకి తీసుకెళ్లి ఆమెతో సెక్స్ లో పాల్గొన్నాడు. మరో సందర్భంలో తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని చెప్పి ఆమెను అపార్టుమెంటుకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేసాడు. తన కోరిక తీరిన తర్వాత ఆమెను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు.
అతనికి తనపై ప్రేమలేదు....పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన తనను లొంగదీసుకుని లైంగిక వాంఛ తీర్చుకున్నాడని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. హిందీలో ప్రసారం అయ్యే ‘క్యూంకి సాస్ భి సభి బాహు థి' సీరియల్ లో నటిస్తున్నాడు. ఎంటీవీలో ప్రసారం అయ్యే స్పిట్స్ విల్లా కార్యక్రమంలో కంటెస్టెంటుగా ఉన్నాడు.
బాధితురాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే విషయం తెలియగానే ముంబై సెషన్స్ కోర్టులో యాంటిసిపెటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











