Bigg Boss Season7: బిగ్ బాస్‌లోకి మరో బుల్లితెర జంట.. వీళ్ల కాపురంలో ఏం నిప్పులు పోస్తారో?
బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చినా... బిగ్ బాస్ రియాలిటీ షోకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి సంతవ్సరం ఈ సీజన్ కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇక ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది. సక్సెస్ ఫుల్ గా 6 సీజన్ లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. త్వరలో 7వ సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో గురించి రోజుకో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇక ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....
తెలుగులో మోస్ట్ పాపులర్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. విజయవంతంగా 6 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో త్వరలో 7 వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే... ఈ షో కు సంబంధించిన రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మొదటి సీజన్ లో సినీ తారలతో షో ను నడిపించారు. ఇక ఆ తర్వాతి సీజన్లలో.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్, సీరియల్ యాక్టర్స్, ఫేం లెస్ యాక్టర్స్ తో షోలను నడిపించారు.

బిగ్ బాస్ లోకి రావాలంటే.. సెలబ్రేటి అయి ఉండాలి అంటారు. కానీ ఒకనొకా దశలో బిగ్ బాస్ లోకి వచ్చి ఫేమస్ అవుతున్నారు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే అలాంటి మిస్టేక్స్ రాకుండా ఇప్పుడు బిగ్ బాస్ టీం ఫేమస్ వ్యక్తులను తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. పకడ్భందీగా షో ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 7లోకి వచ్చే సెలబ్రేటీల పేర్లు వీరంటూ హల్ చల్ చేస్తున్నారు.

ఇప్పుడు మరో సెలబ్రేటీ జంట.. ఈ షోలో అడుగుపెట్టబోతుందట. మొన్నటి వరకు దుర్గారావు కపుల్ రానున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు టీవీ యాక్టర్స్ అమర్ దీప్, తేజస్వీని జంట బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అమర్ దీప్,తేజస్వీనిలకు ఇటీవల పెళ్లైంది. వీరు ఇద్దరూ సీరియల్ యాక్టర్సే. ఇక బుల్లితెరపై సందడి చేసిన వీరు.. ఇక బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టబోతున్నారు.
బిగ్ బాస్ లో ఏ జంట వచ్చినా.. వారి కాపురంలో కలహాలు సృష్టించి.. జనాలను ఎంటర్ టైన్ చేస్తుంటారు. మరి అమర్ దీప్, తేజస్వీనిల మధ్య ఎలాంటి చిచ్చులు పెట్టబోతున్నారో తెలియదు. అయితే కొత్తగా పెళ్లైన జంట మధ్య నిప్పులు పోస్తారా అంటూ నెటిజన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. మరి చూడాలి వీరు స్ట్రాంగ్ గా ఉంటారా.. కొట్టుకుంటారా అని.

ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే... ఈ సారి కూడా నాగార్జునే హోస్టుగా రానున్నారు. ఇక ఇప్పటికే ప్రోమో కూడా రిలీజ్ అయి ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ షోలో శోభా శెట్టి, సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ స్వేత నాయుడు, యాంకర్ దీపిక పిల్లి, దుర్గారావు కపూల్, సింగర్ సాకేత్, సురేఖ వాణి, సంతోషం సురేష్ వంటి వారు బిగ్ బాస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమర్ దీప్, తేజస్వీని జంట రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











