వ్యాపారవేత్తను పెళ్లాడిన టీవీ హీరోయిన్! (ఫోటోస్)
హిందీ టీవీ నటి అదితి గుప్తా వివాహం వ్యాపారవేత్త కబీర్ చోప్రాతో బుధవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు టీవీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అదితి, కబీర్ ఎంగేజ్మెంట్ అక్టోబర్లో జరుగగ్గా... బుధవారం ముంబైలో పెళ్లి వేడుక నిర్వహించారు.
హిందీ టీవీ స్టార్స్ ద్రష్టి దామి, అనితా హాసనందిని, కార్తీక్ కమ్రా, రాహుల్ శర్మ తదితరులు ఈ వేడుకకు హాజరైన సందడి చేశారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అదితి, కబీర్
అదితి గుప్తా, కబీర్ చోప్రా మధ్య గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారడంతో రెండేళ్లుగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో ఓ ఇంటివారయ్యారు.

పెళ్లి వేడుకలో టీవీ స్టార్స్
అదితి గుప్తా, కబీర్ చోప్రా పెళ్లి వేడుకలో హిందీ టీవీ స్టార్స్ హిందీ స్టార్స్ ద్రష్టి దామి, అనితా హాసనందిని, కార్తీక్ కమ్రా, రాహుల్ శర్మ తదితరులు.

క్లోజ్ ఫ్రెండ్
తన క్లోజ్ ఫ్రెండ్ దృష్టి దామితో కలిసి అదితి గుప్తా. సోషల్ మీడియాలో వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

అదితి గుప్తా
అదితి గుప్తా ప్రస్తుతం హిందీలో స్టార్ భారత్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘కాల భైరవ రహస్యం 2' అనే సీరియల్‌లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications