ప్రియుడితో అఫైర్.. మరొకరితో పెళ్లి.. బయటపడ్డ టీవీ నటి భాగోతం!
సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బ్రేకప్ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పెళ్లిళ్లు పెటాకులు, అఫైర్లు బ్రేకప్ కావడం మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తుండగా, తాజాగా ఓ టెలివిజన్ నటి నాలుగు నెలల వైవాహిక జీవితానికి తెరపడిందనే వార్తలు వినోద పరిశ్రమను షాకింగ్‌కు గురి చేస్తున్నది. ఆ టెలివిజన్ నటి ఎవరు? ఆమె దాంపత్య జీవితం విఫలం కావడం వెనుక గల కారణాల్లోకి వెళితే..
అదితి శర్మ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అప్పోలోనా అనే షో ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి 2024 సంవత్సరం నవంబర్ మాసంలో అభినీత్‌ను వివాహం చేసుకొన్నది. అదితి కోరిక మేరకు వారి వివాహం గోరేగావ్‌లోని నివాసంలో చాలా సీక్రెట్‌గా జరిగింది. అనంతరం ఓ జోడీ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ఆరు నెలలుగా కలిసి ఉంటున్నారు అని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

అయితే అభిషేక్ మాట్లాడుతూ.. మా వివాహం సీక్రెట్‌గా జరిగింది. మా పెళ్లికి నా సోదరులు, ఆమె సోదరులు, మా తల్లిదండ్రులు హాజరయ్యారు. వారంతా నాలుగు రోజులు ఉన్నారు. దాదాపు పెళ్లిలో చాలా ఫోటోలు తీసుకొన్నాం. అలా నాలుగు రోజులు బంధువుల మధ్య గడిచిపోయింది అని అన్నారు.

అయితే తనకు సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదని అభిషేక్ కౌశిక్ తాజాగా వెల్లడించారు. అదితి కోరిక మేరకు తాను తలవొంచాల్సి వచ్చింది. అలా మా వివాహం జరిగిపోయింది. అయితే బయటి ప్రపంచానికి తనకు పెళ్లి జరిగినట్టు తెలియకూడదనే ఆంక్షలు పెట్టింది. దాంతో పెళ్లి ఓ భ్రమలా మారిపోయింది. ఆమె పెట్టిన కండీషన్లను అంగీకరించాను అని అభిషేక్ తెలిపారు.
అయితే ఆమె పెట్టిన కండీషన్ల వల్ల నాకు పెళ్లి జరిగిందని నా స్నేహితులకు గానీ, నా బంధువులకు గానీ తెలియదు. పేరు మాత్రమే నాకు పెళ్లి అయిందనే ఫీలింగ్ ఉంది. అయినా సరే అంటూ లైఫ్‌ను ముందుకు సాగించాను. అయితే తనకు అపోల్లేనా షోలో సహ నటుడు సమర్థ్యా గుప్తాతో అఫైర్ ఉందనే విషయం తెలిసింది. ఆ తర్వాత వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాం అని అభిషేక్ తరుఫు న్యాయవాది వెల్లడించారు.
అయితే మ్యారేజ్ బ్రేకప్ చేసి విడాకులు తీసుకోవాలనుకొంటే మాకు ప్రతిఫలం చెల్లించాలని అదితి కుటుంబ భసభ్యులు డిమాండ్ చేశారు. వారు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. దాంతో నేను న్యాయనిపుణుల సలహాను తీసుకొన్నాను అని అభిషేక్ వెల్లడించారు. ఇరు వర్గాల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే ప్రస్తుతం పరిహారం చెల్లింపు విషయం వద్ద వివాదం కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











