బాలుడి మరణానికి కారణమైన తెలుగు నటి అరెస్ట్ద్

By Bojja Kumar

Archana
హైదరాబాద్: ఇంద్రాణి సీరియల్ షూటింగు జరుగుతుండగా హైదరాబాద్ లోని చందానగర్లో శుక్రవారం ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో సాత్విక్ రెడ్డి అనే బాలుడు మరణించగా... మరొక చిన్నారి సాత్విక గాయాలపాలైంది. నటి అర్చన నడుపుతున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

అనుమతి లేకుండా షూటింగ్ జరుపుడంపై సీరియల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసారు. యాక్సెడెంట్ కు కారణమైన నటి అర్చనను, అనుమతి లేకుండా షూటింగ్ నిర్వహిస్తుండటంపై ప్రొడక్షన్ మేనేజర్ వెంకట్రావ్, దర్శకుడు శరత్, డ్రైవర్ రాజును పోలీసులు అరెస్టు చేసారు.

కారు వెళ్లే సన్నివేశం చిత్రీకరిస్తుండగా, కారు అదుపు తప్పి పక్కనే పార్కులో ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా...అప్పటికే సాత్విక్ రెడ్డి అనే బాలుడు మరణించాడు. మరొక చిన్నారి సాత్విక కు కాలు, చెయ్యి ఫ్యాక్టర్ అయింది.

అనుకోకుండా కారు అదుపు తప్పిందని, వెంటనే కళ్లు తిరిగి పడిపోయానని, తన తప్పేమీ లేదని, తప్పులేకున్నా డబ్బు ఖర్చుపెట్టడానికి, వారికి పరిహారం ఇవ్వడానికి నేను సిద్ధమని నటి అర్చన వాదిస్తుండం గమనార్హం. అయితే డ్రైవింగ్ లో సరైన శిక్షణ లేకుండా పక్కన డ్రైవర్ ను కూర్చో పెట్టుకుని అర్చన డ్రైవింగ్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X