twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ నటి విజయరాణి అరెస్ట్, ఏడ్చేసింది (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిసులను మోసం చేసిన టీవీ నటి విజయరాణిని హైదరాబాద్ నగర నేరపరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు శుక్రవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆమెతో పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో విజయరాణి 4 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు పోలీసాఫీసర్ పాలరాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

    మీడియా సమావేశంలో విజయరాణి ఏడ్చేశారు. తాను ఎవరినీ మోసం చేయలేదని విజయరాణి మీడియా ప్రతినిధులతో అన్నారు. కోటి రూపాయల వరకు తనకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని, తాను ఇవ్వాల్సిన డబ్బులు కూడా అంతే ఉంటాయని ఆమె చెప్పారు. తాను తీసుకున్న అప్పులకు అసలుకు నాలుగింతలు వడ్డీ చెల్లించానని ఆమె చెప్పారు. అసలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని, లేకుంటే చంపేస్తామని బెదిరించారని, దానివల్లనే తాను పారిపోయానని ఆమె చెప్పారు.

    జూనియర్ ఆర్టిస్టులను మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బుల వివరాలను, తాను చెల్లించాల్సిన డబ్బుల వివరాలను తాను పోలీసులకు ఇచ్చినట్లు విజయరాణి తెలిపారు.

    తినడానికి కూడా డబ్బు లేదు

    తినడానికి కూడా డబ్బు లేదు


    తన వద్ద తినడానికి కూడా డబ్బులు లేవని, ఇపుడు పోలీసులే తిండి పెట్టారని ఆమె చెప్పారు.

    అధిక వడ్డీల ఆశ

    అధిక వడ్డీల ఆశ


    విజయరాణి అధిక వడ్డీలు ఆశచూపి నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఆమె 3 నుంచి 20 శాతం వరకు కూడా వడ్డీలు చెల్లించి అప్పులు తీసుకుందని, అధిక వడ్డీలు తీసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

    ఆస్తులు స్వాధీనం

    ఆస్తులు స్వాధీనం


    విజయరాణికి చెందిన హైదరాబాదు, గుడివాడల్లోని ఆస్తులను, ఓ కారును, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

    విజయరాణితో పాటు

    విజయరాణితో పాటు


    విజయరాణితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టయినవారిలో ఆమె చెల్లెలు, కుమారుడు, కోడలు కూడా ఉన్నట్లు చెప్పారు.

    English summary
    
 A month after a complaint was lodged against TV artiste Battula Vijaya Rani, who allegedly duped her colleagues, the Central Crime station police nabbed her in Bengaluru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X