టీవీ హీరోయిన్‌పై మాంత్రికుడి రేప్, 26 లక్షలు టోకరా!
హైదరాబాద్: ఆశ పడటంలో తప్పు లేదు....కానీ దురాశ పడితే దు:ఖానికి దారితీస్తుందనే విషయం మరోసారి రుజువైంది. లాటరీలో ఫ్లాట్ గెలుచుకోవాలనే ఆశతో ఓ ప్రముఖ టీవీ నటి చేసిన ప్రయత్నం చివరకు ఆమెపై రేప్ జరుగడానికి కారణమైంది. దీంతో పాటు రూ. 26 లక్షలు పొగొట్టుంది.
ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం ముంబైకి చెందిన హిందీ టీవీ నటి 'మాధా' లాటరీలో ఖరీదైన ఫ్లాట్ దక్కించుకునేందుకు మంత్రగాడిని ఆశ్రయించింది. ఇందుకు గాను సదరు మంత్రగాడు ఆమెను రూ. 26 లక్షలు డబ్బు అడగడంతో పాటు, తనతో సెక్స్‌లో పాల్గొనాలని కోరాడు. ఎలాగైనా 'మాధా' లాటరీలో ఫ్లాట్ దక్కించుకోవాలని ఆశ పడ్డ సదరు నటి అతని ట్రాప్‌లో పడి పోయింది.

27 సంవత్సరాల బాధితురాలు ప్రముఖ హిందీ సీరియల్‌లో నటిస్తోంది. 'మాధా' లాటరీ దక్కించుకోవాలని ఎప్పటి నుండో ఆశ పడుతోంది. గతంలో ఆమె 'మాధా' లాటరీ దక్కించుకునేందుకు ప్రయత్నించింది కానీ విజేతగా నిలవలేక పోయింది. ప్లాట్ దక్కించుకునే క్రమంలో ఆమె మంత్రగాడిని ఆశ్రయించింది.
సదరు మంత్రగాడి పేరు ఇస్మాయిల్ అజిమ్ ఖాన్‌గా తెలుస్తోంది. ఇస్మాయిల్ ఆమె ఇంటికి వెళ్లి పూజలు నిర్వహించడంతో పాటు తనతో సెక్స్‌లో పాల్గొనాలని కోరాడు. దేవుడితో మాట్లాడి ఎలాగైనా ఫ్లాట్ నీకే దక్కేలా చేస్తానని చెప్పి ఆమె వద్ద నుండి రూ. 26 లక్షల తీసుకుని పారిపోయాడు. తర్వాత తాను మోసపోయానని తెలుసుకున్న సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మంత్రగాన్ని అరెస్టు చేసారు.


Click it and Unblock the Notifications











