బాయ్‌ఫ్రెడుతో షికార్లు, టీవీ నటి మృతి అనుమానాస్పదం
కోల్ కతా: ప్రముఖ బెంగాళీ టీవీ నటి దిశా గంగూలీ అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసు విషయమై విచారణ జరుపుతున్నారు. అయితే మరణించడానికి ముందు రోజు వరకు బాయ్ ఫ్రెండుతో జాలీగా షికార్లు కొట్టిన ఆమె అంతలోనే అనుమానాస్పదంగా మరణించడం చర్చనీయాంశం అయింది.
ప్రముఖ బెంగాళీ టీవీ సీరియల్ ‘తుమి అబ్ సే బోలె' లో దిశా సెకండ్ లీడ్ గా చేస్తోంది. మరణించడానికి ఒకరోజు ముందు బుధవారం సాయంత్రం తన బాయ్ ఫ్రెండుతో కలిసి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ మ్యాచ్ చూసింది.

కోల్‌కతా నగరంలోని పర్ణశ్రీ ప్రాంతంలో ఓ అపార్టుమెంటులో దిశా తన తల్లిదండ్రులు, స్నేహితురాలితో కలిసి ఉంటోంది. సంఘటన జరిగిన రోజు రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వెకేసన్ కోసం విదేశాలకు వెళ్లగా, ఆమె స్నేహితురాలు తన సొంతూరైన బారానగర్ కు వెళ్లింది.
బుధవారం సీరియల్ కు సంబంధించిన షూటింగులో పాల్గొన్న దిశా....అనంతరం తన బాయ్ ఫ్రెండు బిబసాయన్ ఘోష్ తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ వీక్షించింది. రాత్రి ఇంట్లో ఇంటరిగా గడిపిన దిశా గురువారం ఉదయం ఇంట్లో శవమై కనిపించింది.


Click it and Unblock the Notifications