తెలుగు టీవీ నటి భారీ మోసం: రూ. 7 కోట్లకు టోకరా

అయితే ఎవరూ ఊహించని విధంగా తన వద్ద జమైన రూ. 7 కోట్ల డబ్బుతో విజయరాణి ఉడాయించింది. మరికొందరు ఈ డబ్బు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. గత కొన్నిరోజులుగా విజయరాణి ఆచూకీ లేక పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు......ఇంత డబ్బుతో ఆమె ఎక్కడికి వెళ్లింది? అనే విషయాలు ఆరా తీస్తున్నారు. రాత్రింభవళ్లు కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం చిట్టీలు వేస్తున్నామని, విజయరాణి ఇలా మోసం చేస్తుందని ఊహించలేదని బాధితులు గగ్గోలు పడుతున్నారు.
ప్రభుత్వం కల్పించుకుని తమ డబ్బు తమకు వచ్చే ఏర్పాటు చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించినపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీవీ ఆర్టిస్టులు కూడా ఒక గ్రూపుగా ఏర్పడి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











