Don't Miss!
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చూడగానే చుట్టుముట్టారు.. ఒంటిపై బట్టలు జారిపోయాయి.. నటికి షాకింగ్ ఘటన
సెలబ్రెటీలకు కొన్నిసార్లు చెప్పుకోలేని ఇబ్బందులు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో పబ్లిక్‌గా పరువు పోయే పరిస్థితులు కూడా వస్తుంటాయి. పబ్లిక్‌గా సెలబ్రెటీ, అందునా ఓ నటి కనిపించిందంటే చాలు ఆమె చుట్టూ జనం చేరుకుంటారు. ఆటోగ్రాఫ్, సెల్ఫీ అంటూ నానా యాగీ చేస్తుంటారు. ఆ సమయంలో కొన్ని ఊహించని ఘటనలు కూడా జరుగుతుంటాయి.
నటికి షాకింగ్ ఘటన.. స్వయంగా
బుల్లితెర పాపులర్ నటి శ్వేతా తివారీకి షాకింగ్ ఘటన ఎదురైయ్యిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. ఓ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ వల్ల షాకింగ్ సంఘటన ఎదుర్కొన్నానని పేర్కొంది. ఆ సమయంలో తనకు బాడీగార్డ్స్ కూడా లేరని చెబుతూ ఆ సంఘటన గురించి వివరించింది.
అందరూ చుట్టుముట్టారు.. ఊహించని పరిణామం
తాను సారి ఈవెంట్ కోసం రాయ్‌పూర్ వెళ్లగా ఈ ఘటన జరిగిందని పేర్కొంది శ్వేతా తివారీ. అక్కడ ఫ్యాన్స్ తనను చూడగానే చుట్టుముట్టేశారని, ఆ సమయంలో తన చుట్టూ బాడీగార్డ్స్ కూడా లేకపోవడంతో ఊహించని పరిణామం చోటు చేసుకుందని శ్వేతా తివారీ చెప్పుకొచ్చింది.
కొన్ని రోజుల పాటు షాక్‌లోనే ఉండిపోయా
ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా తన మీదకు రావడంతో ఒంటి మీద దుస్తులన్నీ ఒక్కొక్కటికీ జారిపోయాయని శ్వేతా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో వాళ్లే అడ్డుగా నిలబడి తన మానాన్ని కాపాడారని ఆమె తెలిపింది. అస్సలు ఊహించని ఆ సంఘటనతో తాను కొన్ని రోజుల పాటు షాక్‌లోనే ఉండిపోయానని ఆమె చెప్పింది.
బుల్లితెర నటిగా క్రేజ్..
బుల్లితెర నటిగా శ్వేతా తివారీకి మంచి క్రేజ్ ఉంది. గత కోనేళ్ళుగా ఆమె టీవీ రంగాన్ని ఏలుతూ వస్తోంది. ‘కసౌటీ జిందగీకే' అనే సీరియల్‌తో శ్వేతా తివారీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
Recommended Video
ఒంటరి జీవితం.. ఇద్దరు పిల్లలు
ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్వేతా తివారి. అతనితో కాపురం చేసిన ఆమె ఓ కూతురుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతనితో గొడవల కారణంగా విడిపోయి.. మరో వ్యక్తిని పెళ్లాడింది. అతనితో కూడా కాపురం చేసిన ఆమె ఓ కొడుకుకి జన్మనిచ్చింది. కానీ అతను శ్వేత కూతురిని హింసిస్తున్నాడని చివరకు తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది శ్వేతా తివారీ.