నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కీలక సాక్ష్యం.. ప్రియుడు ఏమంటున్నాడంటే?
'పవిత్ర బంధం' సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలకసాక్ష్యం దొరికింది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తన ప్రియుడు సూర్యతో వాట్సాప్ ఛాటింగ్ చేశారు. ఝాన్సీ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ సందేశాలను పరిశీలించారు.
ఆత్మహత్యకు ముందు ఝాన్సీ మొత్తం 14 సందేశాలు సూర్యకు పంపినట్లు గుర్తించారు. అందులో ఓ సెల్ఫీ వీడియో కూడా ఉన్నట్లు సమాచారం. వీటి ఆధారంగా పోలీసులు ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే సందేశాల్లో ఝాన్సీ ఏం పేర్కొన్నారనే విషయం పోలీసులు గోప్యంగా ఉంచారు.

సూర్యను విచారిస్తే అసలు నిజాలు బయటకు
మరో వైపు సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాట్సాప్ ఛాటింగ్ కూడా దొరకడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. సూర్యను విచారిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

సూర్యను ఇంకా ప్రశ్నించలేదు
ఒక రోజు గడిచినా సూర్యను పోలీసులు ఇప్పటి వరకు విచారించక పోవడం చర్చనీయాంశం అయింది. మరో వైపు అతడు మీడియా ఛానల్స్‌తో ఫోన్లో మాట్లాడుతూ... తనకు, ఈ ఆత్మహత్యకు సంబంధం, తాను అసలు ఝాన్సీని ప్రేమించలేదంటూ చెబుతుండటం గమనార్హం.

వాట్సాప్ మెసేజ్‌లో ఏముందో తెలియదు, డిలీట్ చేసింది
చనిపోయే ముందురోజు రాత్రి పంపిన వాట్సాప్ సందేశంలో ఏముందో తనకు తెలియదని, నేను ఆ సందేశాలను చూడక ముందే డిలీట్ ఎవ్రీవన్ చేయడంతో తనకు అవి రీచ్ కాలేదని సూర్య అంటున్నారు. సూర్య వాదన ఇలా ఉంటే... పోలీసులు 14 సందేశాలు గుర్తించినట్లు మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ఝాన్సీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన సూర్య
ఝాన్సీ తనను ప్రేమిస్తున్నట్లు చెప్పిందని... అయితే ఆమెకు గతంలో ఇద్దరు ముగ్గురితో ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు తెలియడంతో తాను దూరంగా ఉంటున్నానని, దీంతో పాటు సినిమా అవాకాశాలు ఇప్పిస్తానని చెప్పిన గిరి, బాబీ అనే బ్రోకర్లతో ఏవో గొడవలు కూడా ఉన్నాయని సూర్య ఓ టీవీ ఛానల్‌కు ఫోన్లో వెల్లడించారు.

మిస్టరీగా మారిన ఆత్మహత్య
ఝాన్సీ బాయ్ ఫ్రెండ్ సూర్య బయట పెట్టిన విషయాలతో... ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా? సూర్య చెబుతున్నట్లు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











