twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యుముడితో మూడేళ్లు పోరాటం.. నా కూతురు ప్రాణాలను కాపాడుకొనేందుకు అంటూ ఓంకార్ షోలో నటి కస్తూరి కంటతడి

    |

    యాంకర్, యాక్టర్, డైరెక్టర్ ఓంకార్ హోస్ట్‌గా కొనసాగుతున్న సిక్త్స్ సెన్స్ సీజన్ 4‌లో మరో ఎపిసోడ్ భావోద్వేగంతో నిండిపోయింది. ప్రతీ ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్స్‌కు టెన్షన్ పెడుతూ గేమ్‌ను క్రేజీగా మార్చిన ఓంకార్‌ కూడా ఎమోషనల్‌గా మారిపోయారు. ఒక సెకన్ అంటూ సెలబ్రిటీలను టెన్షన్ పెట్టే ఓంకార్ కూడా టెలివిజన్ నటి, ఇంటింటి గృహలక్ష్మీ ఫేమ్ తులసి అలియాస్ కస్తూరి చెప్పిన మాటలు విని మనసు కరిగిపోయింది. ఈ షోలో కస్తూరి తన కూతురు గురించి చెప్పి కంటతడి పెట్టారు. ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    సిక్త్స్ సెన్స్‌లో కస్తూరి, రాశి

    సిక్త్స్ సెన్స్‌లో కస్తూరి, రాశి

    సిక్ట్స్ సెన్స్ సీజన్ 4 ఎపిసోడ్ నంబర్ 16లో టెలివిజన్ నటి కస్తూరి, అలనాటి హీరోయిన్, ప్రస్తుత టీవీ నటి రాశి పాల్గొన్నారు. సిక్త్స్ సెన్స్‌లో వారిద్దరూ హుషారుగా ఆడారు. ఓంకార్ పెట్టే తికమకను ఎదుర్కొని తమ స్థాయిలో బహుమతులు గెలుచుకొన్నారు. చివర్లలో ఆట టెన్షన్‌గా మారిన సమయంలో ఉపశమనం కోసం కస్తూరిని తన కూతురుకు సంబంధించిన సమస్య గురించి అడిగారు. దాంతో తాజా ఎపిసోడ్ ఎమోషనల్‌గా మారిపోయింది.

    నా హీరో నా కూతురే అంటూ కస్తూరి

    నా హీరో నా కూతురే అంటూ కస్తూరి

    సిక్త్‌సెన్స్ టెన్షన్‌గా సాగుతున్న సమయంలో రాశి కస్తూరి ఇద్దరు తర్జనభర్ఝన పడుతున్నారు. ఆ సమయంలో మీ అమ్మాయి గురించి ఏదో స్టోరి ఉందని చెప్పారుగా.. దాని గురించి చెప్పండి అంటూ కస్తూరిని ఓంకార్ అడిగారు. దాంతో మీకు నచ్చిన హీరో ఎవరు? అని అడిగితే.. మెగాస్టార్ చిరంజీవి అంటూ ఓంకార్ జవాబు ఇచ్చారు. అయితే నాకు నచ్చిన హీరో ఎవరని నన్ను అడిగితే.. నా కూతురు పేరు చెబుతాను. ఎందుకంటే నేను ఇక్కడ వన్ సెకన్ మీరు అంటే ఎంత టెన్షన్ పడుతున్నానో.. అంతకంటే ఎక్కువగా లక్ష సార్లు టెన్షన్ పడ్డాను అంటూ కస్తూరి ఎమోషనల్ అయ్యారు.

    మూడు సార్లు చావును దగ్గరగా చూశా

    మూడు సార్లు చావును దగ్గరగా చూశా

    నా జీవితంలో చావును మూడుసార్లు చూశాను. మొదటిసారి నా తల్లి, రెండోసారి నా తండ్రి విషయంలో చావును చూశాను. నా తల్లిదండ్రులను నా కళ్ల ముందే పొగొట్టుకొన్నాను. ఆ తర్వాత నా కూతురు కళ్లలో అలాంటి చావును చూశాను. మూడు సంవత్సరాలు హాస్పిటల్ బెడ్‌పై ఉన్న నా కూతురు పక్కనే ఉన్నాను. ఒక తపస్పులాగా నా కూతురు పక్కనే ఉన్నా. ఆ సమయంలో నాకు బాబు పుట్టాడు. కానీ మూడేళ్లు నా బాబును కూడా సరిగా చూసుకోలేదు. నా కూతురును బతికించుకోవాలనే ప్రయత్నం తప్ప మరొటి నాకు లేదు అని కస్తూరి కంటతడి పెట్టారు.

    యుముడితో టగ్ ఆఫ్ వార్

    యుముడితో టగ్ ఆఫ్ వార్


    జీవితంలో టాగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడానా అనిపిస్తుంది. నా కూతురు ప్రాణాలను తీసుకెళ్లడానికి ఒకవైపు యముడు.. నా కూతురు ప్రాణాలను కాపాడుకోవడానికి మరో వైపు నేను. అలా యముడితో పోరాటం చేశాను. ఊపిరి ఉన్నంత వరకు ప్రతీ రోజు ఫైట్ చేయాలని నా కూతురు నేర్పించింది. నేను ఏడుస్తుంటే.. నా కూతురు ఎప్పుడూ కంటతడి పెట్టలేదు. అదే ధైర్యం నాలో నింపింది. ఏ రోజుకు ఆ రోజుకు ప్రాణాలు పోతాయనే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో నేను పడిన టెన్షన్ మాటల్లో చెప్పలేను అని కస్తూరి అన్నారు.

    క్యాన్సర్‌ మహమ్మారిని జయించింది అలా

    క్యాన్సర్‌ మహమ్మారిని జయించింది అలా

    నా కూతురు లుకేమియాతో బాధపడుతూ చాలా నరకం అనుభవించేది. ట్రీట్‌మెంట్‌కు తట్టుకొని క్యాన్సర్‌ను చిన్నతనంలోనే జయించింది. ట్రీట్‌మెంట్ జరిగేటప్పుడు అమ్మాయికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఒక లిస్టు ఇచ్చారు. ఆ లిస్ట్ చూస్తే ఇక బతకడమే వద్దు అనుకొనేంత భయం కలిగింది. అలాంటి పరిస్థితులను జయించి నా కూతురు బాగా ఉంది. చదువుల్లో, ఆటల్లో ఫస్ట్. జీవితంలో క్యాన్సర్ మహమ్మారిని ధైర్యంగా జయించిన హీరో అని కస్తూరి తన కూతురును పొగడ్తల్లో ముంచేసింది.

    అందుకే నగలు, బంగ్లాలు లేవు..

    అందుకే నగలు, బంగ్లాలు లేవు..

    నా కూతురు లుకేమియాతో బాధపడిన ఆ మూడేళ్లలో జీవితానికి సరిపడా అనుభవాన్ని, ఎమోషన్స్ పొందాను. ఇప్పుడు బాధైనా, సంతోషమైనా అప్పడికప్పుడు అనుభవించి తీరాలి. రేపు అనేది లేదు కాబట్టి ఇప్పడు సంతోషంగా ఉండాలని నేను నా జీవితాన్ని మార్చుకొన్నాను. అందుకే నాకు పట్టు చీరలు, నగలు, కారు, బంగళా లాంటివి నేను పెట్టుకోలేదు. నాకు ఏమీ అవసరం లేదని.. నా కూతురు మను పేరు మీద ట్రస్ట్ పెట్టి.. లుకేమియాతో బాధపడే పిల్లలకు నాకు తోచిన మేరకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాను. ఈ షోలో వచ్చే మొత్తాన్ని ఆ ట్రస్టుకే ఇచ్చేస్తానని కస్తూరి చెప్పగానే.. యాంకర్ ఓంకార్ చప్పట్లు కొట్టి ప్రశంసించారు.

    Recommended Video

    Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
    తెలుగు బుల్లితెరపై

    తెలుగు బుల్లితెరపై

    తెలుగు బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మీ, జానకి కలగనలేదు సీరియల్స్‌కు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ రెండు సీరియల్స్ టాప్ రేటింగ్‌కు సంబంధించి టాప్ ఫైవ్ జాబితాలో చోటు తక్కించుకొన్నాయి. ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ అర్బన్ ప్రాంతంలో 14.38 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 13.65 టీఆర్పీతో రెండో స్థానంలో దూసుకెళ్తున్నది. 5. జానకి కలగనలేదు సీరియల్ అర్బన్‌లో 10.39 రేటింగ్‌తో, రూరల్‌లో 9.10 రేటింగ్‌తో ఐదో స్థానంలో దూసుకెళ్తున్నది.

    English summary
    Intinti gruhalakshmi fame TV Actress Kasthuri gets emotional in Omkar's in Sixth Sense season 4, She revealed about daughter Manu leukemia treatment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X