ఆ ప్రోగ్రాం డైరెక్టరే నా భర్త.. ఆమె కోసం రాచి రంపాన పెట్టాడు.. సూసైడ్ అటెంప్ట్ చేసిన నటి ఆరోపణలు!

హైదరాబాదుకు చెందిన బుల్లితెర నటి మైధిలి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పోలీసులు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అసలు తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఆమె వెల్లడించారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం కోలుకుంటున్న ఆమె వెల్లడించిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి.

మంచి వాడిలాగా నటించి

మంచి వాడిలాగా నటించి

తన భర్త సామ శ్రీధర్ రెడ్డి ఒక ప్రముఖ షో డైరెక్టర్ అని, తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని మైథిలీ చెప్పుకొచ్చారు. ఈ వివాహ ఇద్దరికీ రెండో వివాహం అని అప్పటికే నాకు ఒక బాబు కూడా ఉన్నాడు అని ఆమె పేర్కొన్నారు.. పెళ్లికి ముందు చాలా మంచి వాడిలాగా నటించేవాడని మనకు ఇక పిల్లలు వద్దు ఈ బాబుని నా సొంత కొడుకు లాగా చూసుకుంటాను అన్నాడు అని ఆమె చెప్పుకొచ్చారు.

ముందు నుంచి రిలేషన్

ముందు నుంచి రిలేషన్

పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే తన రంగులు ఒక్కొక్కటిగా బయటపెట్టాడని మైధిలి ఆరోపించారు. ఆయనకు మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో ముందు నుంచి రిలేషన్ ఉందని మైధిలి ఆరోపించారు. ఆ అమ్మాయి విషయంలో నన్ను కొట్టేవాడని కట్నం, డబ్బు, కారు, బంగారం ఇలా ప్రతి విషయంలో అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ రాచిరంపాన పెట్టాడని ఆమె ఆరోపించారు.

ప్రతిరోజు కొడుతూ ఉండేవాడు

ప్రతిరోజు కొడుతూ ఉండేవాడు


సొంత భర్త 65 తులాల బంగారం దొంగతనం చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రతి రోజూ గొడవలు జరిగేవని ప్రతిరోజు కొడుతూ ఉండేవాడు అని ఆమె ఆరోపించారు.
రజిత ఒకసారి ఫ్రెండ్ అని మరోసారి దూరపు చుట్టం అంటాడని, ఆ చనువుతో రజిత మా ఇంటికి వచ్చి మా మీద పెత్తనం చేసేది అని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మోతే పోలీస్ స్టేషన్ లో ఆయన మీద ఐపీసీ సెక్షన్ 498 కింద కేసు పెట్టానని 2021 సెప్టెంబర్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మరో కేసు పెట్టానని మైథిలీ పేర్కొన్నారు.

ధైర్యం సరిపోక

ధైర్యం సరిపోక

అయితే పంజాగుట్ట పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తన భర్తకు పిసిసి మహిళా అధ్యక్షురాలు సపోర్ట్ ఉండడంతో అతనిని ఏమీ చేయడం లేదని ఆమె ఆరోపించారు. సొంత భర్తను మోసం చేశాడు అని చెబుతూ ఆయన రెండేళ్లుగా నాతో వుండటం లేదని, తెలియకుండానే డైవర్స్ కూడా అప్లై చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇన్నాళ్లు పిల్లలు ఉన్నారని భరించాను కానీ ఇప్పుడు మానసికంగా ధైర్యం సరిపోక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాను అని పేర్కొన్నారు.

భర్తను శిక్షించాలని

భర్తను శిక్షించాలని


పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి లైవ్ లో ఉండగానే సూసైడ్ చేశానని తనకు సరైన న్యాయం జరగాలని, మోసం చేసిన తన భర్తను శిక్షించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి నటి మైధిలి వ్యవహారం మాత్రం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్రీధర్ రెడ్డి ఒక టాప్ షోకి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉండేవారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X