ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య.. షూటింగ్‌లోనే బలవన్మరణం!
వెళ్తూ వెళ్తూ 2025వ సంవత్సరం చిత్ర పరిశ్రమకు తీరని విషాధాలను కలిగిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ మధ్యకాలంలో ప్రాణాలు కోల్పుతున్నారు. వీరిలో బుల్లితెర, వెండితెరకు చెందినవారు ఉన్నారు. అయితే క్షణికావేశంలో కొందరు నటీనటులు తీసుకుంటున్న నిర్ణయాలు అంతులేని దు:ఖాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఓ బుల్లితెర నటి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే...
కన్నడ, తమిళ బుల్లితెర రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందిని. తమిళంలో ఆమె చేసిన గౌరీ సీరియల్‌లో నటనకు గాను కుటుంబ ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని తన మాతృభాషలో కాకుండా తమిళ్, కన్నడ సీరియల్స్‌లో నటించింది. గౌరీ సీరియల్‌లో డ్యూయెల్ రోల్ చేసిన నందిని బాగా పేరు తెచ్చుకున్నారు. ఆమెను నందినిగా కంటే గౌరీగానే ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారంటే తన నటనను అర్ధం చేసుకోవచ్చు. తమిళంతో పాటు కన్నడంలో జీవా హూవాగే, నీనాదే నా, సంఘర్ష, మధుమగల్ తదితర సీరియల్స్‌లో నందిని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లో నందిని నివసిస్తున్నారు. గౌరీ షూటింగ్ నిన్న మొన్నటి వరకు బెంగళూరులోనే జరిగేది. ఇటీవలే ఈ సీరియల్ షూటింగ్‌ని చెన్నైకి మార్చారు. ప్రస్తుతం ఈ షూటింగ్ నగరంలోనే జరుగుతుండగా.. బ్రేక్ కోసమని బెంగళూరు వచ్చిన నందిని తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం గౌరీ సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ ఛానెల్ యాజమాన్యం.. నందిని మరణించినట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తోటీ నటీనటులు, సన్నిహితులు నందిని మరణంతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
నందినికి ఇంకా పెళ్లి కాలేదు.. ప్రస్తుతం కెరీర్‌పైనే ఆమె ఫోకస్ పెట్టారు. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న వేళ ఆమె తీసుకున్న నిర్ణయం షాకిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నందిని రాసిన సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే నందిని తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నట్లుగా కొన్ని వార్తాసంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. నటిగా తాను స్థిరపడాలని అనుకుంటుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో పాటు నటనా రంగానికి దూరంగా ఏదైనా ఉద్యోగం చేయాలని చెబుతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు... గౌరీ సీరియల్ షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఆమె పాత్ర విషం తాగి ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంది. సరిగ్గా ఇప్పుడు ఆమె బలవన్మరణానికి పాల్పడటంతో బుల్లితెర వర్గాల్లో నందిని ఆత్మహత్య వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో గౌరీ సీరియల్ ప్రోమోతో పాటు కొన్ని ఫోటోలను నందిని షేర్ చేశారు. మరి నందిని ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు? దీనికి దారి తీసిన కారణాలు ఏంటీ? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయితే కానీ దీనికి గల కారణాలు బయటికి రావు.


Click it and Unblock the Notifications











