భర్త ఆత్మహత్య... కోలుకున్న టీవీ హీరోయిన్, అతడితో ప్రేమలో, రెండో పెళ్లికి సిద్ధం!

టీవీ నటి పావని రెడ్డి త్వరలో రెండో వివాహానికి సిద్దమవుతున్నారు. భర్త ప్రదీప్ చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె కొన్ని నెలల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇపుడు మరో వివాహం చేసుకోవడం ద్వారా సరి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.

తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన పావని ప్రస్తుతం తమిళంలో 'చిన్న తంబి' అనే సీరియల్‌లో నందిని అనే పాత్రలో నటిస్తోంది. సుమ, రాజీవ్ కనకాల నిర్మాణంలో వచ్చిన 'నేను, ఆయన, ఐదుగురు అత్తలు' సీరియల్ ద్వారా టీవీ నటిగా పావని కెరీర్ ప్రారంభించారు.

2013లో ప్రదీప్‌తో వివాహం

2013లో ప్రదీప్‌తో వివాహం

‘నేను, ఆయన, ఐదుగురు అత్తలు' సీరియల్‌లో తనతో పాటు హీరోగా నటించిన ప్రదీప్‌ను పావని 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రదీప్ 2017లో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురి చేసింది.

కొన్ని రోజుల పాటు నటనకు దూరం

కొన్ని రోజుల పాటు నటనకు దూరం

తను ప్రేమించి, పెళ్లాడిన ప్రదీప్ మరణంతో కృంగుబాటుకు గురైన పావని రెడ్డి నటనకు దూరమయ్యారు. అయితే ఆ ట్రాజెడీ నుంచి కోలుకుని తమిళంలో చిన్నతంబి సిరీయల్ ద్వారా మళ్లీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

నిర్మాతతో ప్రేమలో...

నిర్మాతతో ప్రేమలో...

తమిళ నిర్మాత ఆనంద్ జాయ్ రూపంలో కొత్త తోడు వెతుక్కున్న పావని... అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆనంద్ జాయ్ తమ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కావడంతో ఇంట్లో కూడా వీరి వివాహానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పావని సన్నిహితులు ధృవీకరించారు.

ఆనంద్ నన్ను అర్థం చేసుకున్నాడు

ఆనంద్ నన్ను అర్థం చేసుకున్నాడు

ఆనంద్ నన్ను, నా మానసిక స్థితిని, నా గతాన్ని బాగా అర్థం చేసుకున్నాడని... ప్రదీప్ పేరును నా చేయిపై టాటూగా వేయించాడు, ఇద్దరి మనసులు, అభిప్రాయాలు, ఆలోచనలు కలిశాయి, అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.. అని పావని రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X