twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీతారకు చేదు అనుభవం.. షూటింగ్‌లో షాకింగ్ ఘటన..

    By Rajababu
    |

    టెలివిజన్ నటి రీనా అగర్వాల్‌కు షూటింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. క్యా హాల్ మిస్టర్ పంచాల్ అనే టెలివిజన్ షూటింగ్‌లో ఆమెను కుక్క వెంటాడి వేటాడింది. కుక్క జరిపిన దాడిలో రీనా ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన షూటింగ్ లొకేషన్‌లోని యూనిట్ సభ్యులను షాకింగ్ గురి చేసింది.

    కుక్కతో సీన్ షూటింగ్

    కుక్కతో సీన్ షూటింగ్

    కుక్క జరిపిన దాడిలో రీనా అగర్వాల్ గాయపడిన విషయంపై యూనిట్ సభ్యుడు వివరణ ఇచ్చారు. కుక్కతో ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నాం. అంతలోనే కుక్క వీరంగం సృష్టించింది. రీనాపై పడి రక్కింది. దాంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించాం అని వెల్లడించారు.

    ముఖంపై తీవ్ర గాయాలు

    ముఖంపై తీవ్ర గాయాలు

    కుక్క జరిపిన దాడిలో రీనా కుడి కంటి కింద గాయమైంది. కుక్క కాటుతో ముఖమంతా రక్తస్రావమైంది. పరిస్థితి చేజారేలా ఉండటంతో రీనాను ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌కు తరలించాం. వెంటనే గాయాలకు వైద్యులు కుట్లు వేసి చికిత్సనందించారు. కుక్క గాట్లకు విరుగుడుగా వెంటనే ఐదు ఇంజెక్షన్లను ఇచ్చారు అని చిత్ర యూనిట్ సభ్యుడు తెలిపారు.

    నెలపాటు విశ్రాంతి

    నెలపాటు విశ్రాంతి

    కుక్క దాడికి సంబంధించిన గాయాలు మానడానికి కనీసం 30 రోజులు పట్టే అవకాశం ఉంది. దాంతో ఒక నెలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాతనే ఆమె షూటింగ్‌కు హాజరవుతారు అని చెప్పారు.

    రీనాకు కుక్కలంటే ఇష్టమట

    రీనాకు కుక్కలంటే ఇష్టమట

    అయితే రీనా అగర్వాల్‌కు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్ కుక్కతోపాటు మరికొన్ని పెంపుడు జంతువులు ఉన్నట్టు చెప్పారు. కుక్కలను ఎలా మచ్చిక చేసుకోవాలో ఆమెకు బాగా తెలుసు. కానీ దురదృష్ణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకొన్నది అని ఆమె సన్నిహితుడు వెల్లడించారు.

    అమీర్ ఖాన్ తలాష్ సినిమాలో

    అమీర్ ఖాన్ తలాష్ సినిమాలో

    నటి రీనా అగ‌ర్వాల్ బాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన వ్యక్తి. ఆమె పలు సీరియళ్లతో పాటు సినిమాల్లోనూ నటించింది. అమీర్‌ ఖాన్‌ ‘తలాష్‌', ‘బహెన్‌ హోగీ తేరీ' సినిమాల్లో రీనా న‌టించింది. ఏజెంట్ రాఘవ్ అనే టెలివిజన్ సీరియల్‌లో కూడా నటించింది.

    English summary
    Bad news for all the fans of Kya Haal Mister Panchal (Optimystix Entertainment, Vipul D Shah) actress Reena Aggarwal. Reena who was shooting for the show has been bitten by dog on her face, who she was shooting with.Reportedly, the dog bit her below her right eye. She was then quickly rushed to Kokilaben Ambani Hospital where doctor advised her to get stitches. She already got five injections and has few more to go.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X