యాక్సిడెంట్ చేసి ఒకరిని బలిగొన్న టీవీ నటి
ముంబై : హిందీ టిలివిజన్ నటి సాక్షి పారిఖ్ శుక్రవారం తన కారుతో బీభత్స సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ముంబైలోని కండివల్లి ఏరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వెంటనే స్పందించిన పోలీసులు సాక్షిని కస్టడీలోకి తీసుకున్నారు.
సంఘటన స్థలంలోని కొందరు వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం సాక్షి పారిఖ్ తన కారును అతి వేగంగా డ్రైవ్ చేస్తోందని, వేగాన్ని అదుపు చేయలేక పోయిందని తెలుస్తోంది. దీంతో ఆమె కారు మరో కారుతో పాటు, ఓ మోటార్ సైకిల్, ఓ ఆటోరిక్షాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్ పై ఉన్న వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన వ్యక్తులను ముంబైలోని భాగ్యవతి ఆసుపత్రిలో చేర్పించారు.

అయితే డ్రైవింగ్ చేసిన సమయంలో సాక్షి మద్యం సేవించి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ....ఈ విషయం ఇన్వెస్టిగేషన్లో రెజువు కావాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలం నుంచి వివిధ కోణాల్లో ఆధారాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.
పబ్లిక్ ప్రదేశాల్లో స్టార్స్ ఇలా నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా ఇలానే నిర్లక్ష్యంగా కారు నడిపి మరణానికి కారణం అయ్యాడు. ఆ కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.


Click it and Unblock the Notifications











