ప్రియుడిని పెళ్లి పీటలెక్కిన బుల్లి తెర హీరోయిన్ .. నెట్టింట్లో వీడియో వైరల్
Meghana Shankarappa: ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా నటీనటులు పెళ్లి పీటలెక్కిస్తున్నారు. ఇటీవల కాలంలో సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీని పెళ్లాడింది. అక్కినేని వారసుడు నట సామ్రాట్ నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. సినీనటులే కాదు బుల్లితెర సెలబ్రెటీలు కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా తెలుగువారిని అలరిస్తున్నబుల్లి తెర హీరోయిన్ తన ప్రియుడితో పెళ్లిపెటలెక్కింది. ప్రస్తుతం అమ్మడు వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ బుల్లితెర హీరోయిన్ ఎవరు?
అమ్మడు ఎవరో కాదు.. 'సీతారామం' టీవీ సిరీస్‌లో సీత స్నేహితురాలు ప్రియ పాత్రలో నటించిన మేఘన శంకరప్ప. మేఘన శంకరప్ప ప్రస్తుతం 'సీతారామ' సీరియల్‌లో నటిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత ఈ అమ్మడు నటనవైపు అడుగులు వేసింది. గతంలో ఆమె కలర్స్ కన్నడ ఛానల్‌లో 'నమ్మనే యువరాణి', 'కిన్నారే' సీరియల్స్‌లో నటించింది. అంతేకాదు..'కృష్ణ తులసి', 'రత్నగిరి రహస్య', 'దేవయాని', 'సింధూర్' సీరియల్స్‌లో నటించి మెప్పించింది.

మేఘన ఇప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్‌లో జరిగే డ్యాన్సింగ్ రియాలిటీ షోలో పాల్గొంటుంది. మేఘన శంకరప్ప అనేక విభిన్న నృత్య రూపాలను ప్రదర్శించింది. ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుంది. మేఘన శంకరప్ప ఇప్పటివరకు పలు సీరియల్స్‌లో పాజిటివ్, నెగటివ్ పాత్రలు పోషించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'సీతారామం' సీరియల్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక జయంత్ విషయానికి వస్తే.. బెంగళూరుకు చెందిన జయంత్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
మేఘన గత సంవత్సరం కొత్త ఇల్లు కొని తన గృహప్రవేశ వేడుకను చేసింది. ఈ అమ్మడు జీ ఛానల్ రియాలిటీ షో డాన్స్ కర్ణాటక డాన్స్‌లో కూడా పాల్గొంది. వారు వివాహానికి ముందు దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఆమె తన కాబోయే భర్తతో ఉన్న రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మేఘన - జయంత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేఘన తన ప్రియుడు జయంత్ తో కలిసి వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహ వేడుక ఫిబ్రవరి 9న జరిగింది. వారు తమ వివాహ ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. అభిమానులు వారి వివాహ జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











