డ్రగ్స్ కేసు: ఆమె బండారం బట్టబయలు

ఆమెతోపాటు మరో 44 మంది కూడా డ్రగ్స్ సేవించినట్లు రుజువైంది. పరీక్షల్లో వారు పాజిటివ్‌గా తేలారని ముంబై పోలీసులు తెలిపారు. జుహూ ప్రాంతంలోని ఓక్‌వుడ్ ప్రీమియర్ హోటల్‌లో మే 20వ తేదీన సంపన్నవర్గాల రేవ్ పార్టీ జరిగింది. రేవ్ పార్టీ మొత్తం 92మంది పాల్గొన్నారు.
శిల్పతోపాటు ఆమె భర్త అపూర్వ అగ్నిహోత్రి కూడా పార్టీలో పోలీసులకు దొరికారు. ఇటీవలే అపూర్వ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలగా....తాజాగా శిల్ప కూడా డగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. 'జస్సీ జైసీ కోయీ నహీ' సీరియల్ ద్వారా అపూర్వ అగ్నిహోత్రి పేరు సంపాదించుకున్నారు.
తమపై వచ్చిన ఆరోపణలను అపూర్వ, ఆయన భార్య శిల్ప ఖండించారు. తాము డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వారు చెప్పారు. ఓక్‌వుడ్ హోటల్ సెలబ్రిటీల రేవ్ పార్టీలకు కేంద్రంగా మారిందని అంటున్నారు. దాడుల సందర్భంగా పోలీసులు పది గ్రాముల కొకైన్‌ను, 64 గ్రామల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications