టీవీ నటి శ్రావణి సూసైడ్‌లో ట్విస్ట్.. ప్రియుడు దేవరాజ్ వీడియో రిలీజ్.. తెరపైకి మరో వ్యక్తి
టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ప్రియుడు దేవరాజ్ ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియుడు దేవరాజ్ రెడ్డి వీడియో రిలీజ్ చేసి సంచలన విషయాలను బయటపెట్టారు. అయితే వీడియోలో చెప్పిన విషయాలను కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ప్రియుడు దేవరాజ్ రిలీజ్ చేసిన వీడియోలో..

సూసైడ్‌కు నాకు ఫోన్
నటి శ్రావణి ఆత్మహత్యకు నేను కారణం కాదు. కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి హింసించడం, కొట్టడం వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకొన్నది. సూసైడ్‌కు ముందు నాకు ఫోన్ చేసింది. నన్ను నా కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. ఇక ఆ ఇంట్లో ఉండలేనని చెప్పిందని దేవరాజ్ వెల్లడించారు.

ఐ లవ్ యూ.. పెళ్లి చేసుకొందామని
శ్రావణి తన మరణానికి ముందు కాల్ చేసి.. దేవా ఐ లవ్ యూ. నీవంటే నాకు చాలా ఇష్టం. మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను. నీవు ఒప్పుకొంటే క్యాష్, నగలు తీసుకొనే వచ్చేస్తాను. పెళ్లి చేసుకొని సుఖంగా ఉందాం. సాయి అనే వ్యక్తి నన్న వేధిస్తున్నాడు. రోడ్డుపై జుట్టు పట్టుకొని కొట్టాడని శ్రావణి చెప్పింది అని దేవరాజ్ తాను రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

సాయి హింసిస్తున్నాడని
సాయి తన ముందే శ్రావణిని చంపాలని చూశాడు. సాయిని పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె సూసైడ్ చేసుకొన్నది. శ్రావణి ఫోన్ కాల్ రికార్డింగ్ క్లిప్పులను పోలీసులకు అందిస్తాను. తన తల్లిదండ్రుల ఒత్తిడితోనే తనపై శ్రావణి కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకోమని అడిగారు. నేను నిరాకరించడంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఓ దశలో నాపై పెట్టిన కేసులను వెనుకకు తీసుకొంటామని అన్నారని దేవరాజ్ తెలిపారు.
Recommended Video

దేవరాజ్ వీడియో వ్యాఖ్యలను ఖండించిన సాయి
అయితే నటి శ్రావణి ఆత్మహత్య విషయంలో దేవరాజ్ తన వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వీడియోలో ఆయన చెప్పిన విషయాలు అవాస్తవం. నేను శ్రావణి ఫ్యామిలీ ఫ్రెండ్‌ను. ఆమె చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నాను. ఎక్కడికి పారిపోలేదు. పోలీసులతోనే ఉన్నాను అని సాయి స్పందించారు.


Click it and Unblock the Notifications











