బిగ్ బాస్ బ్యూటీని బ్లాక్ చేసిన రామ్ పోతినేని.. యంగ్ హీరోయిన్ చేసిన మెసేజ్ ఏమిటంటే?

బుల్లితెర నటి శ్రీసత్య తన గురించి ఓ సీక్రెట్ చెప్పింది. ఓ స్టార్ హీరోపై తన ప్రేమను వ్యక్తం చేసింది. ఏకంగా అతని ఎలా లవ్ ప్రపోజ్ చేసిందో కూడా బయట పెట్టింది. శ్రీసత్య తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6తో మరింతగా పాపులారిటీని సంపాదించుకుంది. తొలుత మోడల్ గా, నటి తెలుగు చిత్ర పరిశ్రమలో పలు రకాల ట్రయల్స్ చేసింది. కానీ చివరికి వచ్చి టెలివిజన్ రంగంలో సెటిల్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ సీరియల్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను బాగా దగ్గరైంది.

2018లో తొలిసారిగా 'నిన్నే పెళ్లాడతా' సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2019లో ముద్ద మందారం, అత్తారింట్లో అక్కాచెళ్లెళ్లు, త్రినయని వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు సీరియల్స్ తో పాటు ఇటు వెబ్ సిరీస్ 'తొందర పడకు సుందర వదనా'లో కూడా నటించి మెప్పించింది. ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ సిరీస్ కు సంబంధించిన రెండో ఎపిసోడ్ లో అలరించింది.

TV actress Sri Satya confessed her love for hero Ram Pothineni

జీ తెలుగులో వచ్చిన సూపర్ క్వీన్ తెలుగు రియాలిటీ షోలోనూ మెరిసి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. ఇలా మరుసగా సీరియల్స్, టీవీ ప్రొగ్రామ్స్ తో ఆకట్టుకుంటూనే వస్తోంది. తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీసత్య తన గురించిన ఓ సీక్రెట్ రీసెంట్ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. స్టార్ హీరోకు తను లవ్ ప్రపోజ్ చేసినట్టు చెప్పుకొచ్చింది.

శ్రీసత్య నటిగా తొలుత 'నేను శైలజా' చిత్రంలో అవకాశం అందుకుంది. ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఈమూవీలో ఉస్తాద్, రామ్ పోతినేని, కీర్తి సురేష్ జంటగా నటించారు. అయితే ఈ మూవీ సమయంలోనే శ్రీసత్య రామ్ పోతినేనికి లవ్ ప్రపోజ్ చేసిందంట. అయితే డైరెక్ట్ గా కాకుండా.. రామ్ పోతినేని ఫోన్ నెంబర్ తెలుసుకొని వాట్సప్ లో 'హాయ్.. ఐ లవ్ యూ' అని మెసేజ్ చేసిందంట. దీంతో రామ్ వెంటనే ఆమె నెంబర్ ను డిలీట్ చేశాడంట. అంతే కాదు బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టాడని శ్రీసత్య చెప్పుకొచ్చింది. దాంతో షాక్ అయినట్టు చెప్పు కొచ్చింది.

ఇక రామ్ పోతినేనికి తను బిగ్ ఫ్యాన్ అని తెలియజేసింది. అలా ప్రపోజ్ చేసిన సమయంలో తనకు చాలా చిన్నదాన్ని అని, తెలిసీ తెలియని తనంతో అలా మెసేజ్ పెట్టానని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక శ్రీసత్య బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక మరింతగా క్రేజ్ దక్కించుకుంది. ఇక శ్రీసత్య లైఫ్ లో పవన్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహరం పెళ్లి వరకు వచ్చిందని, ఎంగేజ్ మెంట్ కూడా అయ్యిందని ప్రచారం. ఆ తర్వాత పెళ్లి చేసుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిగా మరింతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X