»   » నటి, యాంకర్ మల్లిక మృతి: హైదరాబాద్ కి మృతదేహం తరలింపు, సుమ కనకాల స్పందన ఇలా

నటి, యాంకర్ మల్లిక మృతి: హైదరాబాద్ కి మృతదేహం తరలింపు, సుమ కనకాల స్పందన ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu
amous TV Anchor Is No More ప్రముఖ టీవీ యాంకర్ కన్నుమూత..

ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఉదయం 10.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ, టీవీ నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

TV Anchor and Actress Mallika Death

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఇవాళ ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. రేపు మల్లిక అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతితో బుల్లితెర శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు బుల్లితెర, వెండితెర ప్రముఖులు మల్లిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తొలి తరం టీవీ యాంకర్ గా మల్లిక ప్రజాభిమానం చూరగొన్నారు. ఆమె మృతి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

యాంకర్‌గా టాప్ స్థానంలో ఉన్న సుమ, ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మల్లిక మరణంపై సుమ తన ఫేస్ బుక్ పేజీలో స్పందిస్తూ.. ''యాంకర్ మల్లిక ఇకలేదు. ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. ఆమె మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..'' అంటూ సుమ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

English summary
TV Anchor and Actress Mallika Dies this morning in Bengalore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu