వివాదంగా మారిన యాంకర్ హేమ రెండో వివాహం.. వదిలించుకోవాలని చూస్తున్నాడు!

బుల్లి తెరపై యాంకర్ గా రాణిస్తున్న మరో సెలెబ్రిటీ జీవితం వార్తల్లోకి ఎక్కింది. ఆమె రెండో వివాహం వివాదంగా మారింది. తన భర్త కోసం యాంకర్ హేమ అతడి ఇంటి ముందే మౌన దీక్షకు దిగిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. తన భర్త, అతడి తల్లిదండ్రులు కలసి తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని హేమ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. యాంకర్ హేమ రెండవ వివాహానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

జూనియర్ ఆర్టిస్ట్‌తో వివాహం

జూనియర్ ఆర్టిస్ట్‌తో వివాహం

టివి యాంకర్ గా రాణిస్తున్న హేమకు చాలా కాలం క్రితం జూనియర్ ఆర్టిస్ట్ అయిన నవతేజ్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి చాలారోజులుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో వివాహ బంధంతో హేమ, నవతేజ్ ఒక్కటయ్యారు. నవతేజ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు వాసి. ఈ వివాహం నవతేజ్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.

రెండో వివాహం

రెండో వివాహం

ఇది హేమకు రెండో వివాహం. అప్పటికే హేమకు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. ఆమె తన మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత నవతేజ్ ప్రేమలో పడింది. నవతేజ్ కుటుంబ సభ్యులకు ఈ వివాహం అసలు ఇష్టం లేదు. దీనితో నవతేజ్ తల్లిదండ్రులు అతడిని తమ వెంట తీసుకుని వెళ్లిపోయారు. తాన్ భర్తని వెతుక్కుంటూ హేమ కూడా నెల్లూరుకు వెళ్ళింది. నవతేజ్ ఇంటి ముందు న్యాయం కోసం మౌనదీక్ష చేపట్టింది.

వదిలించుకోవాలని ప్రయత్నం

వదిలించుకోవాలని ప్రయత్నం

తనని వదిలించుకోవడానికి నవతేజ్, అతడి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని హేమ ఆరోపించింది. నవతేజ్, అతడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆత్మకూరు ఎస్సై ఈ కేసుని విచారణ చేపట్టగా తాను ప్రస్తుతం హైదరాబాద్ వెళుతున్నానని, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవుతానని ఎస్సై కు తెలిపాడు. పోలీసులు అందుకు అంగీకరించడంతో నవతేజ్ హైదరాబాద్ కు వెళ్ళిపోయాడు.

అరెస్ట్ చేస్తామని వార్నింగ్

అరెస్ట్ చేస్తామని వార్నింగ్

పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేయవలసి ఉంటుందని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీనితో హేమ కూడా పోలిసుల విచారణకు హాజరయ్యేందుకు నెల్లూరు నుంచి హైదరాబాద్ పయనమైంది. ప్రేమించి వివాహం చేసుకుని ఇప్పుడు తప్పించుకోవడం ఏంటని పలువురు నవతేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X