పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య.. ఉగాది సంబరాలు రెట్టింపు!
ప్రముఖ తెలుగు యాంకర్ లాస్య పలు టివి షోలతో గతంలో బిజీగా గడిపేది. సరదాగా మాట్లాడుతూ, తన యాంకరింగ్ తో ఆకట్టుకునే లాస్యకు తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు లాస్య వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు వినిపించేవి. ఆ వార్తలని పట్టించుకుకోకుండా లాస్య కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఇదిలా ఉండగా ఉగాది సంబరాలు లాస్య ఫ్యామిలిలో రెట్టింపయ్యేలా విశేషం చోటు చేసుకుంది. లాస్య శనివారం రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

బుల్లితెరకు దూరం
యాంకర్ గా లాస్య పలు కార్యక్రమాల్లో అలరించింది. కొన్నేళ్ల క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. పెళ్లైన తర్వాత లాస్య పూర్తిగా టివి రంగానికి దూరమైంది. దీనితో బుల్లితెర ఆడియన్స్ లాస్యని బాగా మిస్సవుతున్నారు. లాస్య. యాంకర్ రవి జోడి చాలా కాలంపాటు టివి కార్యక్రమాల్లో అలరించారు. అప్పట్లో వీరిద్దరి గురించి అనేక రూమర్లు కూడా ప్రచారం జరిగాయి.

పండంటి మగ బిడ్డ
శనివారం రోజు ఉదయం లాస్య పురిటినొప్పులతో భాదపడుతుండడంతో ఆమెని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. లాస్య ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని లాస్య సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంది. లాస్య పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె భర్త కూడా ఉన్నాడు.

మురిసిపోతున్న ఫోటో
తన బిడ్డని చూసుకుంటూ మురిసిపోతున్న ఫోటోని లాస్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 14 గంటల ప్రయత్నం తర్వాత నువ్వు బయటకు వచ్చావు. నివ్వు చూసిన తర్వాత నా భాధ మొత్తం పోయింది. మీ మొదటి ఊపిరి, ఏడ్చిన విధానం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి అని లాస్య పోస్ట్ చేసింది.

ఉగాది కానుక
ఎన్నో ప్రార్థనల తర్వాత మేము నిన్ను పొందాం అని లాస్య తెలిపింది. ఈ ఉగాది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. కొన్ని నెలల క్రితం లాస్య తాను గర్భంతో ఉన్నానని త్వరలో తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా లాస్య టివీరంగాన్ని వదలిపెట్టి వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.


Click it and Unblock the Notifications











