twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ వర్కరంటావా? టీవీ యాంకర్‌ను తిడుతూ 2వేల కాల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఏషియా నెట్ ఛీప్ కో ఆర్డినేటింగ్ ఎడిటర్ మరియు ఏంకర్ అయిన సింధు సూర్యకుమార్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఆమెకు రీసెంట్ గా రెండువేలకు పైగా తిడుతూ ఫోన్ కాల్స్ వచ్చి షాక్ ఇచ్చాయి. ఎంతో పేరున్న ఆమెకు ఇలాంటి కాల్స్ రావటం ఏమిటీ అంటే...

    రీసెంట్ గా ఆమె ... తను పనిచేస్తున్న ఏషియానెట్ ఛానెల్ లో ...మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించింది. దాంతో ఇది నచ్చని చాలా మంది ఆమెపై మండిపడ్డారు. టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫిబ్రవరి 26న ఈ షో నిర్వహించారు.

    అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. వస్తున్నాయి. ఆ షో జరుగుతున్న సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధుపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. ఆమె ఫేస్‌బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పటమే ఆమెకు తిడుతూ ఫోన్ కాల్స్ రావటానికి కారణమైంది.

    TV anchor Sindhu Sooryakumar gets 2,000 abusive calls

    ఆ కాల్స్ తో విసిగెత్తిపోయిన సింధు.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు ఎంక్వైరీ చేసి, ఆమెకు ఫోన్లు చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు.

    అయితే.. దీని విషయమై ఆమె మీడియాతో మాట్లాడింది. తాను దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. హిందూదేవతను సెక్స్‌వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని ఖండించారు.

    English summary
    Asianet chief coordinating editor and anchor Sindhu Sooryakumar gets over 2,000 abusive calls after the telecast of a debate on whether celebrating Mahishasur jayanti should be considered as treason like HRD Minister Smriti Irani said in her fiery speech in the Parliament.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X