Anchor Suma: ఆ ఒక్క మాటతో రిటైర్మెంట్ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసిన సుమ.. కలిసి రావడం లేదంటూ..
రెండు తెలుగు రాష్ట్రాలలో సుమ పేరు తెలియని వారంటూ ఉండరు. యాంకర్ గా బుల్లితెరపై సుదీర్ఘకాలం నుంచి తన ప్రస్థానం కొనసాగిస్తోన్న సుమ కనకాల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆమె ఎలాంటి షో చేసిన కూడా దానిలో ఉండే ఎంటర్టైన్మెంట్ వేరు. అలాగే ఆమె వెండితెరపై నటిగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఇక సుమ ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె దాదాపు రిటైర్మెంట్ ఇచ్చినట్లే అని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా ఆమె చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ గా సినిమా:అయితే మొదట సుమ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. కేరళకుట్టి అయిన ఈమె దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ సినిమాలో ప్రస్తుతం సక్సెస్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ హీరోగా నటించడం విశేషం.

మలయాళంలో మూడు:అయితే ఈ ఇద్దరికి అప్పట్లో ఆ మూవీ నటన పరంగా ఏ విధంగా ఉపయోగపడలేదు. తరువాత సుమ మలయాళంలో మూడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తెలుగులో బాలకృష్ణ పవిత్ర ప్రేమ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కానీ సుమ అప్పట్లో పెద్దగా క్రేజ్ అయితే అందుకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అంతగా క్లిక్ కాలేదు.
బుల్లితెరపైనే ఫోకస్:ఇక ఆ తరువాత అడపాదడపా సినిమాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వచ్చారు. అయితే యాంకర్ గా సక్సెస్ కావడంతో పూర్తిగా బుల్లితెరపైనే దృష్టి పెట్టింది. సినిమాలలో అవకాశాలు వచ్చిన కూడా ఆమె తిరస్కరిస్తూ వచ్చారు. స్టార్ యాంకర్ గా మారిపోయిన సుమ ఈ మధ్యకాలంలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో కూడా యాంకర్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

మరో ఫ్లాప్ సినిమా:బుల్లితెరపై రియాలిటీషోలు తగ్గించి సినిమా ఈవెంట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. చివరిగా గత ఏడాది జయమ్మ పంచాయితీ అనే సినిమాతో ఆమె వెండితెరపై కనిపించారు. ఆ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న కూడా మూవీ మాత్రం సక్సెస్ కాలేదు. దీంతో సినిమాలకి ఇక దూరంగా ఉండాలని సుమ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
యాక్టింగ్ వద్దులే:తాజాగా నిట్ ఇంజనీరింగ్ ఫెస్ట్ లో పాల్గొన్న యాంకర్ సుమ విద్యార్ధులతో ముచ్చటించారు. తనకి యాంకరింగ్ అంటేనే ఇష్టం అని ఆమె పేర్కొన్నారు. యాక్టింగ్ వద్దులే.. అది పెద్దగా కలిసి రావడం లేదు అని ఆమె నిర్మొహమాటంగా చెప్పేసింది. బిగ్ స్క్రీన్ పై యాక్టింగ్ చేసే ఆలోచన లేదని ఆమె ఒక్క మాటతో తేల్చేసినట్లు అనిపిస్తోంది. ఎందుకో తనకి యాక్టింగ్ అచ్చిరాలేదని పేర్కొన్నారు.

రిటైర్మెంట్ ప్రకటించినట్లే..:ఇక ఈ వ్యాఖ్యల బట్టి సుమ ఇక యాక్టింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించినట్లే అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సుమకు జయమ్మ పంచాయితీ తరువాత కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ వాటిపై అంతగా ఆమె ఫోకస్ చేసింది లేదు. వీలైనంత వరకు టెలివిజన్ వరల్డ్ లోనే బిజీ అయ్యేందుకు సుమ ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











