twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైబర్ క్రైమ్‌లో టీవీ సీరియల్ నటుడి అరెస్ట్

    By Srikanya
    |

    Cyber Crime
    హైదరాబాద్ : సైబర్ క్రైమ్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉద్యోగాల పేరుతో 30 మంది విద్యార్థులను మోసం చేసిన సైబర్ నేరగాడు చింతలపాటి లీలా రామారావును సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు కొన్ని టీవీ సీరియళ్లలోనూ నటిం చాడు.

    ఏసీపీ చిట్టిబాబు కథనం ప్రకారం... గుంటూరుజిల్లా రేపల్లెలోని కూచినపూడికి చెం దిన రామారావు జగద్గిరిగుట్టలో నివసిస్తున్నా డు. ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బు దండుకొని మోసం చేయాలని పథకం వేశాడు. బోగస్ చిరునామాతో ఇంటర్‌నెట్‌లో goldenlandagrotech.కామ్ పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించాడు. వర్క్ ఫ్రమ్ హోం అంటూ జనాలను బోల్తా కొట్టించాడు.

    తమకు ఆర్గానిక్ ఉత్పత్తుల నుంచి ఆవులు, గొర్రెల ఫామ్స్ వరకు అనేక వ్యాపారాలున్నాయ ని పేర్కొన్నాడు. తమ సంస్థలో స్టేట్‌హెడ్ నుంచి బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (బీడీఈ) వరకు అ నేక పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ దరఖాస్తులు ఆహ్వానించాడు.

    స్టేట్‌హెడ్‌కు నెలకు రూ.25 వేల జీ తం, స్కార్పియో వాహనం, జిల్లా మేనేజర్‌కు రూ.15 వల జీతంతో పాటు రవాణా, కరువు భత్యాలు, ఇండికాకారు, ఏరియా మేనేజర్‌కు రూ.10 వేల జీతం, బైక్, బీడీఈలకు రూ.7500 జీతం ఇస్తానంటూ వల వేశాడు. తన వల్లో పడిన దాదాపు 30 మంది విద్యార్థుల నుంచి రామారావు రిజిస్ట్రేషన్ ఫీజ్ పేరుతో రూ.4.5 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు.

    బాధితులు వెబ్‌సైట్‌లోని చిరునామా ఆధారంగా వెతుక్కుంటూ వెళ్లగా అది బోగస్‌ది అని తేలింది. దీంతో మోసపోయామని గ్ర హించిన అమీర్‌పేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వరుణ్‌కుమార్ సీసీఎస్‌లో సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలో పోలీసు బృందం సాంకేతి క ఆధారాల స హాయంతో రామారావు ఆచూకీ కనుగొని అరెస్టు చేసింది.

    English summary
    The Cyber Crime police on Wednesday arrested a TV serial actor, Chintalapudi Leela Rama Rao, 37, for creating a fake website and cheating 30 students, by collecting about Rs 15,000 each from them after promising employment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X