ఎస్ పి బాలసుబ్రమణ్యం పై టీవీ ఆర్టిస్టులు ఫైర్

ఆయన ఆ వ్యాఖ్యలో...డబ్బింగ్ సీరియల్స్ నిషేధించాల్సిన అవసరం లేదని ఒకవేళ నిషేధిస్తే చాలా మంది టెక్నిషియన్స్ ఉపాధి కోల్పోతారని అన్నారు. ఈ డిమాండ్ మెచ్చుకునేది కాదు అన్నారు . మరో ప్రక్క దాసరి నారాయణరావు డబ్బింగ్ సీరియల్స్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన టీవీ ఆర్టిస్టులకు అండగా నిలిచారు.
ఈ సమయంలో ఎస్పీ బాలు వారికి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఇప్పుడు ఇదో చర్చనీయంశంగా మారింది. ఎస్పీ బాలు వ్యాఖ్యలపై టీవీ ఆర్టిస్టులు మండిపడుతున్నారు. అండగా నిలవాల్సిన వారే ఇలా కించపరచి మాట్లాడటం తగదని ఫైర్ అవుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా తీవ్రంగా ఖండించారు.
ఇక టీవీ కళాకారుల డిమాండ్‌పై మాటీవీ తరపున ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సానుకూలంగా స్పందించడంతో టీవీ కళాకారులు తమ ఆందోళనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీక్ష చేస్తున్న టీవీ ఆర్టిస్టులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.


Click it and Unblock the Notifications











