twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ కళాకారుల నిరసన ప్రదర్శన

    By Pratap
    |

    హైదరాబాద్: డబ్బింగ్ సీరియల్స్ పట్ల ఇంత వరకు స్పందించని టీవీ చానెల్స్ ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా మంగళవారం టీవి పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హైదరాబాదులోని ఖైరతాబాద్‌లో గల జీటీవీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు. డబ్బింగ్ సీరియల్స్ తెలుగు టీవీ చానెళ్ల ప్రసారం చేయకూడదని డిమాండ్ చేస్తూ వారు గత కొద్ది కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

    డబ్బింగ్ సీరియల్స్ అపుతున్నట్లు వీలైనంత త్వరగా నిర్ణయం ప్రకటించాలని విజ్ఝప్తి చేస్తూ జీటీవి యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం తమ నిరసన ప్రదర్శనలు మాటీవీ చానెల్ ముందు భారీ సంఖ్యలో పాల్గొన్నబోతున్నట్లు జాక్ కన్వీనర్ డి. సురేష్ కుమార్ తెలిపారు.

    మంగళవారం నిరసన ప్రదర్శనలో నటుడు మాణిక్, శ్రీరాం, కళ్యాణ్, సతీష్, ప్రవీణ్, చంద్ర, కిశోర్, భరణి, చక్రి, నందు, మలక్‌పేట శైలజ, స్వప్న, రాధిక, కౌశిక్, సెల్వరాజ్, జమాలుద్దీన్, సత్యం యాబీ, విజయచందర్, బెంగుళూర్ పద్మ, మనచౌదరి, ప్రసూన, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.

    TV Artists stage dharna at ZTV

    టీవీ కాళాకారులు, సాంకేతిక నిపుణుల ఆందోళనకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కూడా మద్దతు ఇస్తున్నారు. తెలుగు టీవీ చానెళ్లలో డబ్బింగ్ సీరియళ్లను ఆపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    English summary
    TV serials artists and technicians staged dharna in front of ZTV at Khairatabad in Hyderabad today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X