పెళ్లికి ముందే సహజీవనం.. టెలివిజన్ యాక్టర్లకు నెటిజన్ల వేధింపులు..

యూట్యూబర్‌,నటి సోనియా సింగ్, నటుడు సిద్ధూ పవన్ తెలుగు డిజిటల్ ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన సెలబ్రిటీ జంట. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. ఈ ఇద్దరూ షార్ట్ ఫిల్మ్స్,వెబ్ సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తమ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో అభిమానులను ఆకట్టుకున్నారు ఈ జంట. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే, ఈ ప్రయాణంలో తాము ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, సమాజం నుంచి వచ్చిన విమర్శలు, నెటిజన్ల వేధింపుల గురించి సోనియా తాజాగా భావోద్వేగంగా మాట్లాడారు.

జబర్దస్త్ నటి వర్షా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కిస్సిక్ టాక్స్' కార్యక్రమంలో పాల్గొన్న సోనియా సింగ్ తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, కెరీర్, సమాజం నుంచి ఎదురైన విమర్శలపై మనసు విప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జీవితంలో మళ్లీ ఇలాంటి రోజులు రావొద్దని ఎప్పుడైనా అనిపించిందా? అనే ప్రశ్నకు సోనియా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కొన్ని వారాల క్రితం ఇదే ప్రశ్న అడిగితే చాలా బాధాకరమైన సందర్భాలు గుర్తుకు వచ్చేవని, కానీ ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని ముందుకు సాగుతున్నానని చెప్పారు.

Sonia Singh Siddu Pavan

తన జీవితంలో ఎదురైన కష్టాలను ఇప్పుడు భారం అనుకోవడం లేదని, వాటిని ఓవర్‌కమ్ చేస్తూ మరింత బలంగా మారానని తెలిపారు. "మనకు ఎంత కష్టాలు వస్తే అంత సక్సెస్ అవుతామనే నమ్మకం నాలో ఉంది. అందుకే ఇప్పుడు గతాన్ని పట్టించుకోకుండా నా ప్రయాణంపై దృష్టి పెడుతున్నాను" అని సోనియా పేర్కొన్నారు. సోనియా మాట్లాడుతూ సమాజంలోని ద్వంద్వ వైఖరిని కూడా ప్రస్తావించారు. "మా ముందుకు వచ్చి మీరు ఎంతో మంచి జంట, మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుందని చెబుతారు. కానీ, అదే వ్యక్తులు వెనక్కి వెళ్లాక 'ఇంకా పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు' అంటూ కామెంట్లు చేస్తుంటారు. అంతేకాదు లేనిపోని సంబంధాలను కూడా సృష్టించి ప్రచారం చేస్తుంటారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను, సిద్ధూ పవన్ కలిసి ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని సోనియా వెల్లడించారు. కొందరు తమ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటూ నేరుగా తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి "పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు.ఈ పరిస్థితుల వల్ల తన తల్లి చాలా ఆందోళన చెందేదని చెప్పారు."ఏదైనా కారణంతో మేమిద్దరం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సమాజం ఏమంటుంది?" అనే భయం తన అమ్మను ఎప్పుడూ వెంటాడేదని సోనియా భావోద్వేగంగా చెప్పారు.

సోనియా ఇంకా మాట్లాడుతూ.. 'ఇతరుల జీవితాల్లోకి తొంగిచూడటమే కొందరికి అలవాటు. వాళ్ల ఇంట్లో కూడా నాలాంటి కూతుళ్లు ఉండొచ్చు. కానీ వాళ్లు తమ కుటుంబాన్ని వదిలేసి ఎదుటివారి జీవితాల గురించి మాట్లాడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు" అని అన్నారు. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకుంటూ జీవిస్తే ముందుకు వెళ్లలేమని, సమాజాన్ని మార్చడం మన చేతుల్లో లేదని చెప్పారు. అందుకే ఇతరుల మాటలను పట్టించుకోకుండా తమ లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు.

జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సంఘటనలే మనిషిని మానసికంగా మరింత బలంగా మారుస్తాయని సోనియా అభిప్రాయపడ్డారు. విమర్శలు, అవమానాలు, అపార్థాలు అన్నీ కూడా జీవితంలో భాగమేనని, వాటిని అధిగమించినప్పుడే నిజమైన విజయాన్ని ఆస్వాదించగలమని చెప్పారు. నియా చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో వివిధ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

Read more about: jabardasth siddu bigg boss telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X