For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీవీ స్టార్లు పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

|

ఒకప్పటితో పోలిస్తే టీవీ రంగానికి డిమాండ్ బాగా పెరిగింది. సినిమా రంగంలో మాదిరిగానే తెలివిజన్ ఫీల్డులో కూడా సెలబ్రిటీలు బాగా సంపాదిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేని వారు బుల్లితెర రంగాన్ని తమ కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. కొందరు సినిమా స్టార్లు సైతం ఇటు వైపు వస్తున్నారంటే ఇక్కడ అవకాశాలు, ఆదాయం ఏ స్థాయలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మధ్య టీవీ సెలబ్రిటీలు కూడా సినిమా స్టార్లకు ఏ మాత్రం తీసిపోకుండా పబ్లిగ్గా సెన్సేషన్ క్రియేట్ చేయడం‌లో ముందుంటున్నారు. ముద్దులతో రెచ్చిపోతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చారు ఆసోపా-రాజీవ్ సేన్

సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ఇటీవల టీవీ నటి చారు ఆసోపాను పెళ్లాడారు. పెళ్లి తర్వాత థాయ్‌లాండ్‌కు హనీమూన్ వెళ్లిన ఈ జంట... తమ రొమాంటిక్ ముద్దు ముచ్చట్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు.

పెళ్లికి ముందు నుంచే..

చారు అసోపా, రాజీవ్ సేన్ పెళ్లికి ముందు నుంచే రిలేషన్లో ఉన్నారు. తమ మధ్య ఎంత బలమైన ప్రేమ బంధం ఉందో తెలియజేస్తూ సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసిన ఫోటోలు సంచలనం అయ్యాయి. ముద్దు ఫోటోలు పబ్లిగ్గా షేర్ చేయడం ద్వారా తాము పెళ్లి చేసుకోబోతున్నామనే సంకేతాలు ఇచ్చారు.

ఫాలోయింగ్ పెంచుకోవడమే లక్ష్యంగా...

చారు ఆసోపా-రాజీవ్ సేన్ ఇద్దరూ టీవీ రంగంలో ఫాంలో ఉన్న సెలబ్రిటీలే. అభిమానుల్లో ఫాలోయింగ్, పబ్లిసిటీ పెంచుకోవడానికే తమ రొమాంటిక్ ఫోటోలు వీరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పెళ్లి తర్వాత వీరు మీడియాలో మరింత హైలెట్ అయ్యారు.

ఏక్తా కౌల్, సుమీత్ వ్యాస్

‘మేరే ఆగ్నే మె' నటి ఏక్తా కౌల్, సుమీత్ వ్యాస్ వివాహం 2018లో జరిగింది. ఇటీవల వారు తైవాన్ వెకేషన్ వెళ్లిన సందర్భంగా ఇద్దరూ తమ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఏక్తా, సుమీత్ లిప్ లాక్స్

తైవాన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేసిన సందర్భంగా ఇద్దరూ లిప్ లాప్ ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ఫోటోలను అబిమానులతో పంచుకున్నారు. మై ఫస్ట్ ఫుగ్గా రైడ్ విత్ మై ఫుగ్గా అంటూ సుమీత్ వ్యాస్ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు.

రోనిత్ రాయ్-నీలం రాయ్

రోనిత్ రాయ్, నీలం రాయ్ వివాహం జరిగి దాదాపు పది సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఈ జంట ఒకరిపై ఒకరికి ఏ మాత్రం ప్రేమ తగ్గకుండా తమ రిలేషన్ ఫిప్ మెయింటేన్ చేస్తున్నారు. ఇటీవల తన భార్యను ముద్దాడుతూ దిగిన ఫోటోను రోనిత్ రాయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

శరద్-కీర్తి

శరద్ కేల్కర్, కీర్తి గైక్వాడ్ ‘సాత్ ఫెరె' సీరియల్ షూటింగులో ప్రేమలో పడ్డారు. ఇటీవల ఓ పార్టీలో పాల్గొన్న సందర్భంగా ఇద్దరూ పబ్లిగ్గా ముద్దుల్లో ముగిపోయి అందరినీ ఆశ్చర్య పరిచారు. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

జై భానుశాలి-మహి విజ్

జై భానుశాలి-మహి విజ్ త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఐదేళ్ల క్రితం జరిగిన తమ వివాహానికి సంబంధించిన రొమాంటిక్ ఫోటోలు షేర్ చేశారు.

కెయిత్-రేచల్లె

బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న కెయిత్-రేచల్లె రావు తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట గతేడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తమ పెళ్లి రోజు సందర్భంగా వీరు ముద్దు ఫోటోల అభిమానులతో పంచుకున్నారు.

ప్రిన్స్-యువిక

ప్రిన్స్ నరూలా, యువికా చౌదరి తమ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. వారు ఇటీవల షేర్ చేసిన ఓ రొమాంటిక్ పిక్ అభిమానులను టెమ్ట్ చేసే విధంగా ఉంది.

Read more about: yuvika chaudhary prince narula
English summary
Television couples who come across as docile on screen are different in real life. A few television couples do not shy away when it comes to showing their love for their partners in public. While a few celebrities are seen sharing PDA at events, some of them share their PDA filled pictures on their social media accounts. Take a look at popular TV faces, who have made headlines for locking lips in public.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more