»   » హైదరాబద్ లో .. చెట్టుకు ఉరేసుకుని టీవీ రిపోర్టర్‌ ఆత్మహత్య

హైదరాబద్ లో .. చెట్టుకు ఉరేసుకుని టీవీ రిపోర్టర్‌ ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తీవ్రమనస్తాపం చెందిన ఓ టీవీ రిపోర్టర్‌ సుమన్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీడియా వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ సంఘటన మంగళవారం శామీర్‌పేట పెద్దచెరువు సమీపంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మచ్చ బొల్లారానికి చెందిన సుమన్‌(25) ఓ టీవీలో రిపొర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నవంబర్‌ 27, 2016న మరో ఇద్దరు రిపోర్టర్లు, అల్వాల్‌ పీఎస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి రూ.19లక్షలను దొంగతనం చేశాడు.

Tv News reporter Suicide

ఈ ఘటనలో బొల్లారం పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. 4రోజుల క్రితమే జైలునుంచి బయటికి వచ్చిన సుమన్‌.. జీవితంపై విరక్తిచెంది చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళ వారం సాయంత్రం 5 గంటలకు స్థానికులు శామీర్‌ పేట పోలీసులకు సమచారం అందించారు.

సంఘ టనా స్థలానికి చేరుకుని మృతదేహాన్నిపోస్టు మార్టం నిమితం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడికి తల్లి లక్ష్మీబాయి, ఇద్దరు సోదరిణులుఉన్నారు. మృతుడి జేబులో రెండు తెల్ల పేపర్లు, ఒక పెన్‌, రెండు ఆర్టీసీ బస్‌ టిక్కెట్‌లున్నాయని శామీర్‌పేట ఎస్సై అబ్దూర్‌ రజాక్‌ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

English summary
Suman, a 25-year-old reporter for a telugu television channel,was found hanging from a tree.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu