బుల్లితెర నటికి కరోనా పాజిటివ్.. జ్వరంతోనే షూటింగ్స్.. షాక్ లో స్టార్ మా యాక్టర్స్
కరోనా వైరస్ దెబ్బకు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా కరోనా జోరు రోజురోజుకి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా బుల్లితెర నటీనటులను ఈ మహమ్మారి మరింత కలవరపెడుతోంది. ఇటీవల మరో సీరియల్ నటికి కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
Recommended Video

జాగ్రత్తలు తీసుకోకపోవడంతో..
కొన్ని రోజుల క్రితం తెలుగు సీరియల్ ఆర్టిస్టులు షూటింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ వేయక తప్పలేదు. అయితే మొన్నటివరకు జరిగిన షూటింగ్స్ లలో కొందరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో నటీనటులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అందులో మరో ప్రముఖ సీరియల్ నటికి కూడా కరోనా సోకినట్లు తేలింది.

ఆమె కథ సీరియల్ ఫేమ్..
స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఆమె కథ సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మరికొందరు స్టార్ మా సీరియల్ నటులు ఆందోళన చెందుతున్నారు. షూటింగ్స్ సమయంలో కొందరు జ్వరంతోనే పాల్గోన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ మధ్య నవ్య కూడా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

15రోజుల క్రితమే..
15రోజుల క్రితమే షూటింగ్స్ ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువైనట్లు తెలుస్తోంది. కన్నడకు చెందిన నవ్యశ్రీ ఆమె కథ సీరియల్ తో పాటు ఈటీవీ నా పేరు మీనాక్షి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు కరోనా వచ్చిందని తెలియడంతో తోటి స్టార్ యాక్టర్స్ కూడా క్వారంటైన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రభాకర్ ఎలా ఉన్నారంటే..
గత కొన్నిరోజుల క్రితం నటుడు ప్రభాకర్ కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. జీ తెలుగులో వచ్చే సూర్యకాంతం సీరియల్ ద్వారా ప్రభాకర్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతను కొలుకుంటున్నట్లు సమాచారం

ఇండస్ట్రీలో ఆందోళన..
మొన్న ప్రభాకర్ నేడు నవ్య శ్రీలకు పాజిటివ్ అని తేలడంతో మళ్ళీ అలజడి మొదలైంది. వారు కొంత మంది సినీ ప్రముఖులను కూడా కలిసినట్లు తెలుస్తోంది. వారిలో ప్రముఖ స్టార్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వీరి కుటుంబ సభ్యులనే కాకుండా రీసెంట్ గా సన్నిహితంగా ఉన్నవారిని కూడా క్వారంటైన్ లోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
ఇటీవల బండ్ల గణేష్ కూడా కోవిడ్ 19 భారిన పడిన విషయం తెలిసిందే. హెయిర్ ప్లాంటేషన్ కోసమని వెళ్లిన గణేష్ కరోనా భారిన పడి ఉంటారని తెలుస్తోంది. ఇక బండ్ల గణేష్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కొలుకున్నట్లు రీసెంట్ గా ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి ఎక్కువవ్వడం వలన ఇండస్ట్రీలో చాలా వరకు సెలబ్రెటీస్ షూటింగ్స్ లో పాల్గొనడానికి ధైర్యం చేయడం లేదు.


Click it and Unblock the Notifications











