twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలనాటి హాట్ లేడీపై టీవీ సీరియల్

    By Bojja Kumar
    |

    Zeenat Aman
    బాలీవుడ్ రీల్ ఒక్కసారిగా వెనక్కి తిప్పితే ఒకప్పుడు తన అందచందాలతో యువతను ఉర్రూతలూగించిన జీనత్ అమన్ కళ్లముందు మొదులుతుంది. ఆమె పేరు చెప్పగానే గిటార్ చేతిలో తీసుకుని 'చురాలియా హై తుమ్నే జో దిల్ కో' అంటూ ఆమె సృష్టించిన మెరుపులు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. 'యాదోం కి బారాత్' సినిమా మళ్లీ చూస్తే బాగుండునని అనిపిస్తుంది.

    బాలీవుడ్‌లో గ్లామరస్‌ తారగా పేరొందిన జీనత్‌ అమన్‌ ఆ కాలంలో మిస్‌ ఇండియా అందాల పోటీలలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె 1970లో మిస్‌ ఆసియా పసిఫిక్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు.అనంతరం గ్లామర్‌ ప్రపంచంలో వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోయారు.

    బాలీవుడ్‌లోకి ప్రవేశించి నాటి అందమైన తారల్లో అగ్రస్థానంలో నిలిచారు. పలు హిట్‌ సినిమాల్లో నటించి తన అందచందాలతో అందర్నీ మైమరపించారు. అందమైన తారగా వెలుగొందిన ఆమె నాడు పలువురు యువతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆధునిక యుగంలో మహిళలు మారాల్సి ఉందని ఆమె గట్టిగా చెప్పేవారు.

    తాజాగా ఆమె జీవితంపై ఓ టీవీ సీరియల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. జీనత్ అమన్ అంగీకారంతోనే ఈ టీవీ సీరియల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    The buzz is that A TV serial plans on Zeenat’s life. Zeenat is okay about recording on paper her own life, the idea of a televised series on her completely put her off. "Would you believe it, just the last week a channel approached me for a serial on my life, and asked me to be the narrator, sort of a sutradhar! I refused immediately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X