కొత్త రూల్ :హీరోలూ...టీవీషోలలో కనపడొద్దు
బెంగళూరు : బుల్లితెరపై హీరోల రియాలిటీ ప్రదర్శనలకు కళ్లెం వేయాలంటూ నిర్మాతలు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి ఫిర్యాదు చేశారు. సుదీప్, రమేష్ అరవింద్, గోల్డెన్‌స్టార్ గణేష్‌లు వివిధ ఛానళ్లలో వారాంతాల్లో రియాలిటీ ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల కన్నడ సినిమాల్ని వీక్షించే ప్రేక్షకులే కరువయ్యారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయమై మంగళవారం వాణిజ్య మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసింది. అయితే వాణిజ్య మండలి అధ్యక్షుడు హెచ్.డి.గంగరాజు చెన్నై వెళ్లడంతో దీన్ని రద్దు చేశారు. నిర్మాతల ఫిర్యాదుపై స్పందించేందుకు నటులు నిరాకరించారు. మండలి నుంచి నోటీసు వస్తే అప్పుడు చూస్తామని సమాధానమిచ్చారు.
నిర్మాతల ఫిర్యాదుపై చర్చించేందుకు మంత్రి, నటుడు అంబరీష్‌తో సమావేశం కావాలని నటీనటులు తీర్మానించారు. తెలుగులోనూ ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఉందని ఇక్కడ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ చెప్పుకుంటున్నారు. మన హీరోలు వీకెండ్ లలో టీవీ షోలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











