NTR's EMK show rating దారుణంగా.. నాగార్జున మరీ డిజాస్టర్‌గా, అల్లు అర్జున్ మరోసారి సూపర్ హిట్!

ప్రస్తుత ఏడాది 2021 సంవత్సరానికి సంబంధించి 35వ వారానికి చెందిన టెలివిజన్ కార్యక్రమాలు, బుల్లితెరపై ప్రదర్శించిన సినిమాలకు సంబంధించిన రేటింగ్స్ వెల్లడించారు. కరోనావైరస్ పరిస్థితుల్లో ఇంటికే ప్రేక్షకులు పరిమితం కావడం వల్ల టెలివిజన్ కార్యక్రమాలకు, సీరియల్స్, గేమ్ షోలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో ఎలా? సాగుతున్నది. అలాగే తమన్నా భాటియా ప్రారంభించిన మిస్టర్ షో ఎలా కొనసాగుతుందనే విషయాలను పరిశీలిద్దాం...

బుల్లితెరకు భారీ డిమాండ్

బుల్లితెరకు భారీ డిమాండ్

సినిమా థియేటర్ల విషయంలో కొనసాగుతున్న సమస్యల కారణంగా సినిమాల రిలీజ్ నిలిచిపోయింది. ఏపీలో థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుపై కొనసాగుతున్న సంక్షోభం కారణంగా పలు భారీ చిత్రాలు రిలీజ్ వాయిదా పడటంతో బుల్లితెరకు మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో టెలివిజన్‌పై ఎన్టీఆర్, తమన్నా లాంటి షోలతోపాటు బిగ్‌బాస్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్

అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్

ఇక బుల్లితెరపై గతవారం ప్రసారమైన అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురం చిత్రం మరోసారి మంచి రేటింగును సొంతం చేసుకొన్నది. అల వైకుంఠపురంలో చిత్రం జెమినిలో ప్రసారం కాగా, అర్బన్ ప్రాంతంలో 11.31 పాయింట్ల రేటింగ్, అలాగే రూరల్, సెమీ అర్బన్ ప్రాంతంలో 9.58 రేటింగును సొంతం చేసుకొన్నది. ఇటీవల కాలంలో మంచి రేటింగ్ వచ్చిన చిత్రంగా అల వైకుంఠపురంలో నిలిచింది.

నాగార్జున ఆఫీసర్ మరీ దారుణంగా

నాగార్జున ఆఫీసర్ మరీ దారుణంగా

ఇక స్టార్ మాలో ప్రసారమైన నాగార్జున ఆఫీసర్ సినిమా బుల్లితెరపై కూడా డిజాస్టార్‌గా నిలిచింది. నాగార్జున, ఆర్జీవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా పరాజయం పాలైందో తెలిసిందే. తాజాగా టీవీలో ప్రసారం చేయగా అర్బన్‌లో 2.21 రేటింగ్, రూరల్‌లో 1.67 రేటింగ్ వచ్చింది.

గాలి సంపత్ ఒకేగా

గాలి సంపత్ ఒకేగా

ఇదిలా ఉండగా, స్టార్ మా టెలివిజన్‌లో ప్రసారమైన గాలి సంపత్‌కు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయిన గాలి సంపత్ బుల్లితెరపై అంతంత మాత్రమే రేటింగ్‌ను సాధించింది. అర్బన్ ప్రాంతంలో 3.88, రూరల్, సెమీ అర్బన్ ప్రాంతంలో 3.53 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షో దారుణంగా

ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షో దారుణంగా

ఇక జెమినీలో కొత్తగా ప్రారంభమైన ఎన్టీఆర్ షో పెద్దగా రేటింగ్ సాధించలేకపోయినట్టు కనిపిస్తున్నది. ఎవరు మీలో కోటిశ్వరులు షో 34వ వారంలో అర్బన్ ప్రాంతంలో 3.54 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 4.82 రేటింగును సొంతం చేసుకొన్నది. అయితే ఈ రేటింగ్‌ను బట్టి షో పెద్దగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేదనే వాదన మొదలైంది. అయితే రానున్న రోజుల్లో ఈ రేటింగ్ మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Anchor Ravi VS Shanmukh Jaswanth || Filmibeat Telugu
రుచించని తమన్నా భాటియా వంటకం

రుచించని తమన్నా భాటియా వంటకం

ఇక జెమినీలో ప్రారంభమైన మరోకు షో తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మిస్టర్ చెఫ్ అనే వంటల కార్యక్రమం కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతున్నది. మిస్టర్ ఛెఫ్ షో అర్బన్‌లో 2.47 రేటింగ్, రూరల్‌లో 3.18 రేటింగును సాధించింది. రానున్న రోజుల్లో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X