Mahesh Vs Jr NTR: అరవింద సమేత‌కు దారుణంగా రేటింగ్.. మరోసారి దుమ్ము దులిపేసిన మహర్షి!

దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు వెంటాడుతున్న సమయంలో ప్రేక్షకులకు వినోదానికి టెలివిజన్, ఓటీటీలు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. థియేటర్లకు వెళ్లడానికి ఆడియెన్స్ జంకుతున్న నేపథ్యంలో టీవీలు, ఓటీటీలకు ఇటీవల కాలంలో భారీగా ఆదరణ పెరుగుతున్నది. బయటకు కాలు పెట్టలేని పరిస్తితుల్లో ప్రేక్షకులకు బుల్లితెర వినోదమే కాలక్షేపంగా మారింది. దీంతో టెలివిజన్ కార్యక్రమాలకు మంచి రేటింగ్ వస్తున్నాయి. గతవారం అంటే ఈ ఏడాది 33వ వారంలో టెలివిజన్‌లో ప్రదర్శించిన సినిమాలకు రేటింగ్ ఎంత వచ్చిందంటే..

33వ వారంలో టీవీలో ప్రదర్శించిన చిత్రాలు

33వ వారంలో టీవీలో ప్రదర్శించిన చిత్రాలు

గతవారం టెలివిజన్‌లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, ఆర్య, సాయేషా జంటగా నటించిన టెడ్డీ డబ్బింగ్ చిత్రాలు ప్రదర్శించారు. అంతేకాకుండా రానా దగ్గుబాటి నటించిన ఘాజీ, మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోగా వచ్చిన మహర్షి, విజయ్ ఆంటోని నటించిన సూపర్ డూపర్ హిట్ బిచ్చగాడు రిలీజ్ బుల్లితెరపై ప్రదర్శించారు.

జెమినీలో దుమ్మురేపిన మహర్షి

జెమినీలో దుమ్మురేపిన మహర్షి

జెమిని ఛానెల్‌లో ప్రదర్శించిన మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రానికి మరోసారి ప్రేక్షకులు బుల్లితెరపై ఆదరించారు. ఈ చిత్రం ఇప్పటికీ పలుమార్లు ప్రదర్శించారు. అయినా మహర్షి చిత్రం మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అర్బన్ ప్రాంతంలో మహర్షి చిత్రం 6.98 రేటింగును, రూరల్ ప్రాంతంలో 5.48 రేటింగును సొంతం చేసుకోవడం విశేషం.

టెడ్డీకి మంచి ఆదరణ

టెడ్డీకి మంచి ఆదరణ

ఇటీవల లాక్‌డౌన్ కాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన టెడ్డీ చిత్రాన్ని స్టార్ మాలో ప్రదర్శించారు. ఆర్య, సాయేషా దంపతులు కలిసి నటించిన ఈ చిత్రం భారీ రేటింగును సొంతం చేసుకొన్నది. పిల్లల్ని ఆకట్టుకొనే కథనంతో రూపొందిన ఈచిత్రం అర్బన్ ప్రాంతంలో 6.51 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 5.70 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. చిన్న చిత్రమైనా బలమైన సినిమా కంటెంట్‌ కారణంగా భారీ రేటింగును సొంతం చేసుకోవడం గమనార్హం.

బిచ్చగాడుకి మంచి రేటింగ్

బిచ్చగాడుకి మంచి రేటింగ్

తమిళ డబ్బింగ్ చిత్రంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే కాకుండా ఇటీవల కాలంలో 50 రోజులు, 100 రోజులు జరుపుకొన్న చిత్రంగా బిచ్చగాడు తెరకెక్కింది. మదర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రం గతంలో కూడా టెలివిజన్‌లో పలుమార్లు ప్రదర్శించారు. అయితే తాజాగా జెమినీలో ప్రదర్శించిన ఈ చిత్రం అర్బన్ ప్రాంతంలో 4.12 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 3.31 రేటింగ్‌ను నమోదు చేసింది.

ఆకట్టుకోలేకపోయిన ఘాజీ

ఆకట్టుకోలేకపోయిన ఘాజీ

రానా దగ్గుబాటి నటించిన ఘాజీ చిత్రం థియేటర్లలో మంచి ఫలితాన్ని అందుకొన్నది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. గతవారం స్టార్ మా టెలివిజన్‌‌లో ప్రసారమైంది. అయితే ఈ చిత్రాన్ని టీవీలో పలు మార్లు ప్రదర్శించడం వల్ల పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా అర్బన్‌లో 2.93 రేటింగ్, రూరల్‌లో 1.92 రేటింగును సొంతం చేసుకొన్నది.

Recommended Video

Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
అరవింద సమేతకు ముఖం చాటేసిన ప్రేక్షకులు

అరవింద సమేతకు ముఖం చాటేసిన ప్రేక్షకులు

ఇక ఎంతో స్టార్ ఎట్రాక్షన్, దిమ్మతిరిగే డైలాగ్‌లు ఉన్న అరవింద సమేత వీర రాఘవ కూడా ఈ వారం జీ తెలుగులో మరోసారి ప్రసారం చేశారు. అర్బన్‌లో ఈ చిత్రం 2.05 రేటింగ్, రూరల్‌లో 1.67 రేటింగును సొంతం చేసుకొన్నది. అయితే త్రివిక్రమ్ సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X