షాక్ : ‘బాహుబలి’ ఆడియో పంక్షన్ కు ...TV5 టీఆర్ఫీ
హైదరాబాద్ : కోటిరూపాయలు వరకూ వెచ్చింది ‘బాహుబలి' ఆడియో పంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ తెచ్చుకుంది టీవి 5 సంస్ధ. అంత పెద్ద మొత్తం చెల్లించి ఈ ఆడియో పంక్షన్ టెలీ కాస్ట్ రైట్స్ తెచ్చుకోవటం అనేది ఒక ఫూలిష్ నిర్ణయంగా ట్రేడ్ పండిట్స్ తప్పుపట్టారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అయితే అందరి అంచనాలను తలక్రిందలు చేస్తూ... టీఆర్పీలలో ఈ ఫంక్షన్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఛానెల్ కు లాభాల పంటను పండించింది. TV9, 10TV, NTV, Studio N లను దాటుకుని...47.5 టీఆర్పీ రికార్డ్ క్రియేట్ చేసింది. అదే రోజు...టీవి 9 కు...6.35 టీఆర్పీ వచ్చింది.
ఈ విషయాన్ని ‘బాహుబలి' ఛాయాగ్రాహకుడు సెంధిల్ కుమార్... సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఆనందంతో షేర్ చేసారు. దాన్ని మీరూ ఈ క్రింద చూడండి.
‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' . ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.



Click it and Unblock the Notifications











