twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ వారం తెలుగు టీవీ ఛానెల్స్ లో టాప్ ఏది?

    By Srikanya
    |

    TV9
    హైదరాబాద్ : తెలుగు న్యూస్ ఛానెల్స్ ఒక దానికొకటి పోటీ పడుతూ టీఆర్పీ రేటింగులు పెంచుకుంటూంటాయి. ముఖ్యంగా న్యూస్ ఛానెల్స్ లో ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంటిలో కనీసం ఒక టీవీ. ఎవరు ఏ చానెల్ చూస్తున్నారో, ఎవరు ఏ కార్యక్రమం అంటే ఇష్టపడుతున్నారో అనేది ఈ రేటింగ్ లు ద్వారా తెలుస్తాయి. ఈ రేటింగ్ లను టామ్ ఇస్తూంటుంది. టామ్ అంటే మరేమీ కాదు, టెలివిజన్ ఆడియన్స్ మెజర్‌మెంట్.

    ఈ వారం టామ్ సంస్ధ ఇచ్చిన వారాంతపు రేటింగ్స్ (అక్టోబర్ 14 వరకూ) ని బట్టి చూస్తే... టీవి 9 ఛానెల్ నెంబర్ వన్ ప్లేసులో ఉంది. 161 జీఆర్పీలు ఈ వారాంతానికి నమోదు చేసింది. గత కొంత కాలంగా నెంబర్ వన్ ప్లేసులో ఉంటూ వస్తున్న టీవీ 5 ఛానెల్ 135 జీఆర్పీలతో రెండవ స్ధానంలోకి పడిపోయింది. అలాగే సాక్షి కూడా నాలుగవ వారానికి పడిపోయింది. ఈటీవీ 2 ఐదవ స్ధానంలో ఉంది. స్టూడియో ఎన్ సైతం ఆరవ స్ధానానికి వచ్చింది. ఎన్ టీవీ ఇంతకు ముందు టాప్ ప్లేస్ లో ఉండేది.
    టామ్ సంస్ధ ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం ఈ వారం...(జీఆర్పీలు)

    ఛానెల్... ఈ వారం... గత వారం

    టీవి9 161 160

    టీవి5 135 150

    ఎన్ టీవి 95 97

    సాక్షి 75 55

    ఈటీవి2 69 74

    స్టూడియో ఎన్ 66 88

    10టీవి 61 62

    ఐ న్యూస్ 37 34

    జీ24 33 28

    ఏబిఎన్ 30 30

    గమనిక.... : ఈ రేటింగ్స్ కేవలం టామ్ సంస్ధ ఇచ్చిన సమాచారం (మీడియాలో ప్రచారంలో ఉన్న) మేరకు ... అలాగే ఈ రేటింగ్ లు వారం వారం మారిపోతూంటాయి.. వచ్చే వారానికి అంతా పూర్తిగా మారిపోవచ్చు కూడా.

    English summary
    Recent ratings of this week show the ratings of TV channels as follows.With the hundreds of crores of rupees spent annually on TV programmes and commercials, reliable TV audience information is required to evaluate and maximise the effectiveness of this investment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X